తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో సరయు చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ అనడంలో సందేహం లేదు. సరయు గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. యూట్యూబ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు కూడా సరయును షో లో చూసిన సమయంలో ఎవరు అనే అనుకున్నారు. సరయును గుర్తు పట్టే వారు అతి కొద్ది మందే ఉంటారు. అయినా కూడా ఆమెను బిగ్ బాస్ నిర్వాహకులు ఎందుకు తీసుకున్నారు అనేది ప్రశ్న.
బిగ్ బాస్ అంటే వివాదాలు.. ఇంట్లో గొడవలు.. రచ్చ చేయడాలు. సరయు యూట్యూబ్ లో బి గ్రేడ్ స్కిట్ లు.. షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ ఉంటుంది. ఆమె చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆమె మాట్లాడే మాటలు మరీ పచ్చిగా ఉంటాయి. ప్రతి సందర్బంలో కూడా ఆమె బూతులు మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే ఆమెను బూతుల కోసం నిర్వాహకులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఆమె హౌస్ లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడి ఉంటే అందరి దృష్టిలో పడి ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండేదేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సరయు కేవలం యూట్యూబ్ వీడియోలు మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కాని అవేవి పెద్దగా ఆడింది లేదు.. ఆమెకు గుర్తింపు తెచ్చింది లేదు. ఆమె పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లు చెబుతూ ఉంటుంది.
కొన్ని సార్లు ఆమె ఇంటర్వ్యూల్లో బూతులు మాట్లాడటం వల్ల కూడా జనాల్లో గుర్తింపు దక్కించుకుంది. అలా చాలా సందర్బాల్లో చాలా రకాలుగా సరయు గురించి సోషల్ మీడియాలో వచ్చింది. కాని ఆమెకు ఉన్న గుర్తింపు మాత్రం తక్కువే. ఆమెను కేవలం బిగ్ బాస్ లో బూతులు ఉంటే జనాల దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు.
సోషల్ మీడియాలో సరయు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వారు వందల్లో ఉంటారు. కాని సరయులా బోల్డ్ గా మాట్లాడే వారు మాత్రం తక్కువ మంది ఉంటారు. అందుకే ఆమెను ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సరయుకు గుర్తింపు లేకున్నా కూడా ఆమె ఏదో షో లో ప్రత్యేకంగా నిలుస్తుందని అనుకుంటే ఆమె తన ప్రత్యేకతను చాటిందే లేదు. దాంతో ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు.
ఒక వేళ ఆమె ప్రత్యేకంగా ఉండి బూతులతో ఇతర సభ్యులను పదే పదే రెచ్చగొట్టినట్లుగా మాట్లాడి ఉంటే తక్కువ ఓట్లు వచ్చినా నిర్వాహకులు ఉంచే వారు అనేది టాక్. ఏ కారణం వల్ల అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను తీసుకున్నారో ఆ క్వాలిటీని ఆమె చూపించలేదు. అందుకే బిగ్ బాస్ నుండి ఆమె త్వరగా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక మళ్లీ ఆమె తన క్వాలిటీని చూపిస్తుంది. ఒక వేళ మళ్లీ సరయుకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే అక్కడకు వెళ్లి రచ్చ చేయడం మాత్రం ఖాయం అంటున్నారు.