బిగ్ బాస్ 5: సిరి, షణ్ముఖ్ డ్రామా ఎక్కువైందా?

బిగ్ బాస్ సీజన్ 5లో మరో ఎపిసోడ్ ముగిసింది. నిన్నటి ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే సాగింది. ఫినాలే వీక్ ను బిగ్ బాస్ లైట్ తీసుకున్నాడేమో అనిపిస్తోంది. అందుకనే టాస్క్ ల విషయంలో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు. మొన్న జరిగిన సన్నీ, సిరి గొడవ నిన్న ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. సిరి టిఫిన్ చేస్తే అది తినకుండా సన్నీ, మానస్ వేరేది చేసుకుని తిన్నారని షణ్ముఖ్, సిరి మీద గొడవ పడటం.. సిరి వెళ్లి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరిగింది.

టిఫిన్ చేస్తున్నప్పుడే వద్దు అని చెప్పాల్సింది కదా, చేసేశాక అది పక్కన పెట్టేసి మీరు వేరేగా చేసుకుని తినడం ఏంటని సిరి ప్రశ్నించింది. దానికి శ్రీరామ్ చంద్ర కూడా సపోర్ట్ చేసాడు. ఇక బిగ్ బాస్ లో రెగ్యులర్ లో ఉండే ఒక సెగ్మెంట్.. జ్యోతిష్యం. కార్డ్స్ చూసి హౌజ్ మేట్స్ కు ఉన్న సందేహాలను క్లియర్ చేయడానికి ఒక పేరున్న జ్యోతిష్కురాలు వచ్చారు. వారితో వీడియో కాల్ లో హౌజ్ మేట్స్ ముచ్చటించారు. వారికున్న సందేహాలను తీర్చుకున్నారు. మానస్, సన్నీ, శ్రీరామ్ లు తమ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో అని ప్రశ్న వేశారు. అలాగే అందరూ కూడా బిగ్ బాస్ లో తమ విజయావకాశాలను అడిగి తెలుసుకున్నారు.

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తన గేమ్ ను మొదలుపెట్టాడు. హౌజ్ మేట్స్ ను బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని చెప్పి గార్డెన్ ఏరియాకు తీసుకొచ్చి, ఒకరి జర్నీ ఈరోజుతో పూర్తవుతుందని తెలిపాడు. దానికోసం హౌజ్ మేట్స్ ఐదుగురు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దానికి అనుగుణంగా మానస్ – షణ్ముఖ్ కు ఓటు వేసాడు. షణ్ముఖ్ – సన్నీతో తనకు ఎక్కువ గొడవలు ఉన్నాయి కాబట్టి తను వెళ్లిపోవాలని అన్నాడు. శ్రీరామ్ చంద్ర – తనకు సిరితో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కాబట్టి ఆమె పేరు చెప్పాడు. సిరి – మానస్ పేరు చెప్పింది. ఇక సన్నీ కూడా షణ్ముఖ్ పేరు చెప్పాడు.

షణ్ముఖ్ కు అత్యధికంగా రెండు ఓట్లు వచ్చినా కానీ బిగ్ బాస్, సిరి ఎలిమినేట్ అయిందని తెలిపాడు. దీంతో షణ్ముఖ్, సిరి ఇద్దరూ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. తీరా చూస్తే సిరిని మళ్ళీ కన్ఫెషన్ రూమ్ ద్వారా లోపలికి తీసుకొచ్చాడు. ఇది అందరూ ఊహించిన ట్విస్ట్ కావడంతో పెద్దగా కిక్ రాలేదు.