సన్నీ వర్సెస్‌ షన్నూ.. కొట్టుకునే వరకు వెళ్లారు

మరోసారి సన్నీ కి కోపం వచ్చింది. టాస్క్ ల్లో ఉన్న సమయంలో అతడు ఏ రేంజ్ లో కోపంతో ఉంటాడో మళ్లీ నిరూపితం అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సన్నీ ఆడుతున్న సమయంలో సిరి అతడిని ఆపేసింది. దాంతో అతడికి కోపం వచ్చింది. అలా చేయడం కరెక్ట్‌ కాదంటూ సన్నీ అనగా అది నా ఇష్టం అన్నట్లుగా సిరి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దాంతో సన్నీకి మరింత కోపం వచ్చింది. దాంతో రెండు మూడు మాటలు అలా అలా వదిలేశాడు. దాంతో సిరి కోపంతో రెచ్చి పోయింది. అదే సమయంలో షన్నూ కూడా వచ్చాడు.

సిరికి మద్దతుగా వచ్చిన షన్నూ పై మరో రేంజ్ లో సన్నీ రెచ్చి పోయాడు. నీవేంట్రా మద్దతుగా వచ్చేది.. ఆడవాళ్లను పంపించి ఆట ఆడుతున్నావు అంటూ సన్నీ నోరు జారాడు. ఆ విషయంలో కాస్త సీరియస్‌ గానే నేటి ఎపిసోడ్‌ లో రచ్చ ఉండబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక నేటి ఎపిసోడ్‌ లో రవి కెప్టెన్‌ అవ్వబోతున్నట్లుగా లీక్ అందింది. మరో వైపు జెస్సీ ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదు. అతడు మళ్లీ సమస్యతో బాధపడుతున్నాడు.