బంగార్రాజుతో బ్లాక్ బస్టర్ ముద్దుగుమ్మ


ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో జాతిరత్నాలు సినిమా ఒకటి ఉంటుంది అనడంలో సందేహం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఆ సినిమాలో హీరోయిన్ గా హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఫరియా నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తన అమాయకపు నటనతో నవ్వించడంతో పాటు తన అందంతో ఆకట్టుకుంది.

చూడ్డానికి ఉత్తరాది ముద్దుగుమ్మ మాదిరిగానే ఉన్నా ఈ అమ్మడు తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల పెద్ద ఆఫర్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో హీరోయిన్ గా ఆమెకు వరుస ఆఫర్లు దక్కాలి. బ్లాక్ బస్టర్ హీరోయిన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తాయి. కాని ఈ అమ్మడికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. కారణాలేమైనా ఫరియా అబ్దుల్లా సినిమాలు రాకపోవడం ఆమెను ఇష్టపడుతున్న వారికి కాస్త అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

ఎట్టకేలకు ఆమెకు ఓ ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో కలిసి ఒక ఐటెం సాంగ్ ను చేసే అవకాశంను ఈమె దక్కించుకుందట. బంగార్రాజు సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఈమె కూడా ఒకరిగా నిలువబోతుంది. అయితే నాగార్జునతో ఈమె చేయబోతున్న ఆ ఐటెం సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.

నాగ్ కు సరైన జతగా ఈమెను భావించిన మేకర్స్ ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జాతిరత్నాలు అమ్మడికి బంగార్రాజు ఐటెం తో అయినా లక్ కలిసి వచ్చి సక్సెస్ లు దక్కించుకుంటుందేమో చూడాలి.

బంగార్రాజు సినిమా లో నాగార్జున మాత్రమే కాకుండా నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. చైతూకు జోడీగా ముద్దుగుమ్మ కృతి శెట్టి కనిపించబోతుంది. ఇటీవలే కృతి శెట్టి లుక్ ను రివీల్ చేయడం జరిగింది. బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ గా వస్తున్న విషయం తెల్సిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమాను మించి ఎంటర్ టైన్ మెంట్ ను ఈ సినిమా ఇస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా అంచనాలను అలా అలా పెంచేస్తోంది.

ఇప్పుడు ఫరియా ఐటెం సాంగ్ విషయం కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.