రోజాని చూసి చొంగ కార్చేసాడు!

సీనియర్‌ నటి గ్లామర్‌కి యంగ్‌ కొరియోగ్రాఫర్‌ ఫిదా అయ్యాడు. ఆ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌. సీనియర్‌ నటి రోజా. రోజా ఓ టీవీ కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తుండగా, కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ అదే టీవీలో ప్రసారమవుతున్న కిడ్స్‌ డాన్స్‌ షోకి జడ్జ్‌. ఇద్దరూ ఒకే వేదికపై సందడి చేశారు. రోజా కళ్ళు అంటే ఇష్టం అనీ, రోజా నవ్వు అంటే తనకు ఇంకా ఇంకా ఇష్టం అనీ అంటూ, ఆమెతో డాన్స్‌ చేశాడు కొరియోగ్రాఫర్‌ శేఖర్‌. రోజా అంటే గ్లామర్‌. రోజా అంటే అందమైన నవ్వు. రోజా అంటే అద్భుతమైన డాన్స్‌. 
ఇంకేముంది, కొరియోగ్రాఫర్‌తో డాన్స్‌ చేసి అలరించింది. ఎమ్మెల్యేగా గెలిచినా, టీవీ షోల్లో రోజా తన ఉనికి చాటుకుంటోంది. డాన్స్‌లో దిట్ట కాబట్టి, ఏ పాటకైనా చాలా ఈజ్‌తో డాన్స్‌ చేస్తున్న రోజా, కొన్ని రోజుల క్రితం బాగా లావెక్కినా, ఇప్పుడు మళ్ళీ స్మార్ట్‌గా కనిపిస్తోంది. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా, వారంలో రెండు మూడు రోజులు టీవీల్లో వివిధ షోల ద్వారా అభిమానుల్ని రోజా అలరిస్తూనే ఉన్నారు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.