ఫొటోటాక్ : బాలీవుడ్ ముద్దుగుమ్మలకు తీసిపోని తెలుగు అందాల వింధు

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ స్కిన్ షో తో పోల్చితే సౌత్ హీరోయిన్స్ కనీసం పది ఇరవై శాతం కూడా అందాల ప్రదర్శణ చేసే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ ముద్దుగుమ్మలు కూడా పెద్ద ఎత్తున అందాల వింధు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు స్కిన్ షో విషయంలో కాస్త వెనుకబడి ఉంటారు.. ఒక వేళ వారు చేయాలనుకున్న కూడా తెలుగు ప్రేక్షకులు ఆధరించరు అని ఇంతకు ముందు ఒక టాక్ ఉండేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారింది. తెలుగు అమ్మాయిలు అందాల వింధు లో ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు అమ్మాయి దివి ఏకంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలకు పోటీ అన్నట్లుగా తన అందాల ప్రదర్శణ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు కొన్ని సార్లు చూస్తే ఈమె తెలుగు అమ్మాయేనా లేదంటే ఏ కత్రీనా కైఫ్ చెల్లి అయ్యి ఉంటుందా అనిపిస్తుంది.

బిగ్ బాస్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దివి గత రెండేళ్లుగా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ కు ముందు కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్స్ తో కుర్ర కారును రెచ్చగొడుతోంది. ఆకట్టుకనే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ గా ముందు ముందు మంచి సినిమాల్లో చేసే అవకాశం ఉంది. తెలుగు అమ్మాయిలకు తెలుగు లో ఎక్కువ అవకాశాలు రావడం కష్టం. కనుక ఈ అమ్మడు ఇతర భాషల్లో నటిస్తే బాగుంటుంది. అక్కడ ఈ అమ్మడికి ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుందని దివి అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నడుము నాభి అందంను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు ఆమె అందంను మరింతగా పెంచాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ అమ్మాయిల స్థాయిలో దివి తన అందాన్ని ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం తెలుగు హీరోయిన్స్ ఈమె ముందు దిగదుడుపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి తో భోళా శంకర్ సినిమాలో కీలక పాత్రను చేస్తున్న ఈ అమ్మడు రెండు వెబ్ సిరీస్ లు మరియు మ్యూజిక్ ఆల్బం అంతే కాకుండా రెండు మూడు చిన్న సినిమాల్లో కూడా కనిపించబోతుంది. మొత్తానికి దివి బిగ్ బాస్ తర్వాత అనూహ్యంగా బిజీ గా మారింది.