సూపర్‌ స్టార్‌ మూవీకి ‘మైత్రి’ సాయం పెద్దది

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించి నటించిన ‘బరోజ్‌’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3డి వర్షన్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న బరోజ్‌ సినిమాకు మలయాళంలో భారీ క్రేజ్‌ హైప్‌ ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం బరోజ్‌ సినిమా గురించి కనీసం చర్చ జరగడం లేదు. ఇదే తీరుతో సినిమా విడుదల అయితే కనీసం ప్రేక్షకులు థియేటర్‌ దారి పట్టే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తం […]

ఎట్టకేలకు గూఢచారి స్పందించాడు..!

అడవి శేష్‌ హీరోగా దాదాపు ఆరు ఏళ్ల క్రితం వచ్చిన ‘గూఢచారి’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకి మంచి స్పందన లభించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు చేయాలని అడవి శేష్‌ భావించాడు. అందుకోసం ఇప్పటికే రెండో పార్ట్‌ను ప్రకటించాడు. గూఢచారి 2ను ప్రకటించాడు. సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పటి […]

నాగార్జున కుండబద్ధలు కొట్టేశారు..!

మహానటి తర్వాత సెలబ్రిటీ బయోపిక్ లు ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ బయోపిక్ సినిమాల హవా తెలుగు పరిశ్రమకు పాకింది. మహానటి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్ టీ ఆర్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఆ సినిమా వచ్చింది. ఐతే బాలకృష్ణ నటించిన ఈ సినిమాలు ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే ఎన్టీఆర్ తర్వాత ఏఎన్నార్ బయోపిక్ కూడా తీస్తారా అన్న ప్రశ్న నాగార్జునని ఎప్పుడు అడుగుతుంటారు. ఎన్టీఆర్ […]

గేమ్ చేంజర్.. రాజుగారి కష్టాన్ని చూసిన రావిపూడి!

దిల్ రాజు బ్యానర్ నుంచి 2025 సంక్రాంతికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మరొకటి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోంది కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చేస్తుందనే ధీమాతో దిల్ రాజు ఉన్నారు. అయితే ఆయన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ […]

వీడియో : అల్లు అర్హ పద్యంకి బాలయ్య ఫిదా

సాధారంగా ఈతరం పిల్లలకు తెలుగు మాట్లాడటమే సరిగా రావడం లేదు. ఇక సెలబ్రెటీ పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉంటారు, వారికి మినిమం తెలుగు రాదు. చాలా మంది స్టార్‌ కిడ్స్ చూస్తే తెలుగు మాట్లాడలేక ఇంగ్లీష్‌లో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది అల్లు అర్జున్‌ బిడ్డ అల్లు అర్హ తెలుగు మాట్లాడిన విధానంకు బాలకృష్ణ సైతం అవాక్కయ్యాడు. తెలుగులో మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగులో అర్హ పాడిన పద్యం ప్రతి ఒక్కరికి షాక్‌గా ఉంది. […]

కన్నప్ప.. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వచ్చేది ఎప్పుడంటే..

టాలీవుడ్‌లో హీరో మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కన్నప్పపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక కథ, నటీనటుల ఎంపిక […]

‘అభ్యర్థన కోర్టు ముందు కాదు’… ఆర్జీవీకి హైకోర్టులో బిగ్ షాక్!

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చర్చ బలంగా నడిచిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆర్జీవీపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా… ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. దీంతో.. ఇటీవల మద్దిపాడు […]

2 రోజుల్లో అందాల‌ న‌య‌న్ ల‌వ్ స్టోరి తెర‌పైకి..!

నెట్‌ఫ్లిక్స్ ఇండియా OTT డాక్యుమెంటరీ `బియాండ్ ది ఫెయిరీ టేల్`లో విఘ్నేష్ శివన్‌తో న‌య‌న్ ప్రేమకథను చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. డాక్యుమెంటరీ నవంబర్ 18న న‌య‌న‌తార‌ పుట్టినరోజున ప్రదర్శిత‌మ‌వుతుంది. ఈ ఏడాదితో నయనతార 40 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార వ్యక్తిగత జీవితాన్ని చూపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ డాక్యుమెంట‌రీ నెటిజనుల్లో చ‌ర్చ‌గా మారింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నుండి ఒక క్లిప్ విడుదలైన తర్వాత ప్ర‌జ‌ల్లో ఉత్సుక‌త పెరిగింది. డాక్యుమెంటరీ లో […]

జ‌యం ర‌వి-ఆర్తీ విడాకుల‌పై కోర్టు ఏమందంటే?

త‌మిళ న‌టుడు జ‌యం ర‌వి భార్య ఆర్తీతో విడిపోతున్న‌ట్లు కొంత కాలం క్రితం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటీష‌న్ కూడా దాఖ‌లు చేసారు. తాజాగా ఈ పిటీష‌న్ ని కోర్టు ప‌రిశీలించింది. జ‌యం ర‌వి కోర్టు కు హాజ‌రు కాగా, ఆర్తీ వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం ఇరు వ‌ర్గాల వాద‌నలు వింది. అనంత‌రం ఇద్ద‌రు మరోసారి క‌లిసి మాట్లాడుకోవాలని..రాజీ కోసం ప్ర‌య‌త్నించాల‌ని సూచించింది. […]

మ‌నోహ‌రి.. కాబోయే పెళ్లి కూతురులా..!

బుద్దిగా ముద్దొచ్చేస్తోంది.. లుక్కులో సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతోంది. కోక ర‌వికెలో ఎంతో ఒద్దిక‌గా అలా కుర్చీలో కూచుని అందంగా వేచి చూస్తోంది. ఈ రూపం.. ఆ ట్రెడిష‌న్ స్ట‌న్న‌ర్‌.. మునుప‌టి క‌ళ్ల‌తో కాదు ఈరోజు ప్ర‌త్యేకంగా చూడాలి నోరాని. ఇంత‌లోనే ఎంత‌గా మారిపోయింది ఈ మొరాక‌న్ బ్యూటీ? `మ‌నోహ‌రీ….` అని తెలుగు లిరిసిస్ట్ పాట రాసాడంటే.. ఈ అందాన్ని చూసే క‌దా! భార‌త‌దేశంలో అరుదైన ప్ర‌తిభావంత‌మైన‌ డ్యాన్సింగ్ క్వీన్స్ లో నోరా ఒక‌రు. బుల్లితెర రియాల‌టీ షోల‌లో మ‌లైకాతో […]

దేవి ‘కంగువా’ దెబ్బ.. ఆస్కార్ విజేత అలా అనేసరికి..

సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ కి మొదటిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కథ, కథనం మాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మూవీ క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై పెదవి విరిచారు. అంచనాలని అందుకోవడంలో ‘కంగువా’ విఫలం అయ్యిందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండు టైం లైన్స్ […]

ఆ సినిమాకి గ్రీన్ సిగ్నెల్..ఆపాల‌ని ట్రై చేసినా ప‌న‌వ్వ‌లే!

స‌రిగ్గా సినిమాల రిలీజ్ స‌మ‌యంలో ఊహించ‌ని వివాదాలు తెర‌పైకి వ‌స్తుంటాయి. షూటింగ్ చేసుకున్నంత కాలం ఎలాంటి అడ్డంకులుండ‌వు. రిలీజ్ కి వ‌చ్చే స‌రికి వివాదం చుట్టుముట్ట‌డం కోర్టుల్లో కేసు..వాద‌న‌లు అంటూ క‌థ అప్ప‌టిక‌ప్పుడు అడ్డం తిర‌గుతుంటుంది. ఓ ర‌కంగా ఇలాంటి కేసులు సినిమాల‌కు కోట్ల రూపాయ‌ల ఉచిత ప‌బ్లిసిటీని సైతం తెచ్చిపేట్టేవే. తాజాగా `మ్యాచ్ ఫిక్సింగ్ – ది నేషన్ ఎట్ స్టేక్’ సినిమా విడుదలను ఆపాలంటూ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ చేసిన విజ్ఞప్తిని బాంబే […]

సూపర్ స్టార్‌ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యి ఉంటే రికార్డ్‌లు బ్రేక్ అయ్యి ఉండేవి. వేట్టయాన్‌ తో బ్రేక్‌ చేయలేక పోయిన రికార్డ్‌లను కూలీ సినిమాతో రజనీకాంత్‌ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తన ప్రతి […]

మెగాస్టార్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..?

సత్యదేవ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో చిరు తన స్పీచ్ తో ఫ్యాన్స్ అందరినీ అలరించారు. జీబ్రా ఈవెంట్ అంతా మెగా ఫ్యాన్స్ హంగామాతో నిండిపోయింది. ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మీద తన అభిమానాన్ని డ్యాన్స్ ఇంకా స్పీచ్ ల రూపంలో చూపించాడు సత్యదేవ్. ఆ తర్వాత మైక్ అందుకున్న చిరంజీవి సత్యదేవ్ […]

ఆ రెండు సినిమాలు వరుణ్ తేజ్ కు పడుంటేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తొలి ప్రేమ’. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకీ అట్లూరి. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో, అప్పటి నుంచే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. వెంకీ ఇటీవల ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో, ఇలాంటి కథను వరుణ్ తో ఎందుకు చేయలేదనే కామెంట్లు వినిపించాయి. […]

20 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకునేలా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మట్క. గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. కొంతకాలంగా సరైన సక్సెస్ లు లేని వరుణ్ తేజ్ మట్కా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ కూడా ఈ సినిమా […]

కంగువా.. అసలు సర్ ప్రైజ్ అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా.. దిశా పటానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. నవంబర్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుందీ చిత్రం. పదికి పైగా భాషల్లో విడుదల […]

నాగ్ అశ్విన్.. కల్కి 2 తరువాత అమెతోనే..?

‘కల్కి 2898ఏడీ’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన నాగ్ అశ్విన్ కి దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ‘కల్కి’ చిత్రాన్నీ ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరపై ఆవిష్కరించి నాగ్ అశ్విన్ విజయం సాధించారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానానికి కూడా బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి అభినందనలు లభించాయి. దీపికా పదుకునే ఫస్ట్ తెలుగు […]

చ‌ర‌ణ్ అన్న‌య్య భుజం మీద చేయ్యేస్తేనే 100కోట్లు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `మ‌ట్కా` రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈనెల 14న ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. డిఫరెంట్ టైటిల్ సహా లీకైన కంటెంట్.. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో ఆద్యంతం ఆస‌క్తి పెరుగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌రుణ్ తేజ్ కి స‌రైన స‌క్సెస్ ల్లేవ్. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. హిట్ కొడతాడు అనే కాన్పిడెన్స్ అత‌డు స‌హా మెగా […]

దుల్కర్ సెంచరీ.. ఈసారైనా దక్కేనా?

మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న దుల్కర్ సల్మాన్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రం అంటే ‘సీతారామం’ అని చెప్పాలి. ఇది స్ట్రైట్ తెలుగు మూవీగా తెరకెక్కింది. ఇతర భాషలలో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 98.1 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. 100 కోట్ల క్లబ్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఒకేసారి అన్ని భాషలలో సీతారామం రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయేది. […]