Telugu News

`విశ్వ‌రూపం` మొద‌టి భాగం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. చేసిన ఏ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. `విశ్వ‌రూపం` ..`విక్ర‌మ్` మ‌ధ్య‌లో ఆరేడు సినిమాలు చేసారు. అవ‌న్నీ ఫ‌లితాల ప‌రంగా తీవ్ర నిరుత్సాహ ప‌రిచిన‌వే. అప్ప‌టికే సొంత నిర్మాణంలో ప్ర‌యోగాలు ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో `విక్ర‌మ్` చిత్రాన్ని సొంత బ్యానర పై నిర్మించి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈసినిమా ఫ‌లితం క‌మ‌ల్ ఆర్దిక క‌ష్టాల‌న్నింటిని తీర్చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో అన్ని లెక్క‌లు సరిచేసారు. దీంతో ఉల‌గ‌నాయ‌గ‌న్ రెట్టించిన ఉత్సాహంలో సొంత నిర్మాణ సంస్థ‌లో వ‌రుస పెట్టి ప్రాజెక్ట్ లు ప్ర‌క‌టించారు. ఆయ‌న బ‌య‌ట హీరోల‌తో నిర్మిస్తోన్న చిత్రాలు..తాను న‌టిస్తోన్న సినిమాల నెంబ‌ర్ ఒక్క‌సారిగా పెరిగింది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న మూడు సినిమాల బ‌డ్జెట్ మొత్తం 700 కోట్ల వ‌రకూ ఉంటుంద‌ని ఓ అంచ‌నాగా తెలుస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియ‌న్ -2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయుడికి సీక్వెల్ గా క‌మ‌ల్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ 250 కోట్లు అని తెలుస్తోంది. అలాగే ఖాకీ ద‌ర్శ‌కుడు హెచ్. వినోధ్ తెర‌కెక్కిస్తున్న మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఈ సినిమా కి కూడా 150 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవు తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మ‌ణిర త్నం ద‌ర్శ‌క‌త్వంలో `థ‌గ్ లైఫ్` అనే కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తున్నారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత మ‌ణిసార్ రూటు పూర్తిగా మార్చేసారు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి కంటెంట్ నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈసినిమా బ‌డ్జెట్ 300 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. అంత‌కు పెరిగే అవ‌కాశం ఉంది త‌ప్ప త‌గ్గ‌డానికి ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. విక్ర‌మ్ స‌క్సెస్ నేప‌త్యంలో ఈసినిమాల‌న్నీ ఎద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తాయి. హిట్ అయితే వ‌సూళ్లు..లాభాలు అలాగే ఉంటాయి.

Advertisement
Advertisement
Advertisement