మరోసారి ట్రిప్ కి ప్రభాస్.. ఆ సినిమా పరిస్థితి ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో, ఆయన తదుపరి సినిమా సలార్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా, మరో వైపు ఆయన చేతిలో కల్కి, తో పాటు మారుతి డైరెక్టన్ లో మరో సినిమా కూడా ఉన్నాయి. ఇటీవలే, మారుతి డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా మొదలైంది. అయితే, అంతలోనే, మళ్లీ బ్రేకులు పడ్డాయి. రీసెంట్ గానే ప్రభాస్ […]

మండుతున్న టైమ్ లో.. బిజీబిజీగా తారక్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. నారా కుటుంబం, నందమూరి కుటుంబమంతా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కానీ నందమూరి మూడో తరం ధ్వజ స్తంభమైన యంగ్​ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మౌనం పాటిస్తున్న ఎన్టీఆర్​.. ఇప్పుడు సైలెంట్​గా మరో పని చేశారు. అదేంటంటే.. […]

వీడియో : కనిపించిన అనుష్క గుడ్‌ న్యూస్ చెప్పింది

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అనుష్క కు ఏమైందని కొందరు… ఆమె ఆరోగ్యం విషయం లో మరి కొందరు రకరకాలుగా ప్రచారం చేశారు. ఎంతమంది ఏమన్నా కూడా ప్రమోషన్‌ లో అనుష్క కేవలం వినిపించింది కానీ కనిపించలేదు. తాజాగా సినిమా విడుదల అయి మిశ్రమ స్పందన దక్కించుకుంది. యూఎస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ ను […]

ప్రభాస్.. కన్నప్పకి అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

మంచు విష్ణు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి నేపథ్యంలో జరిగిన ఒక హిస్టారికల్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హిందీలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథలతో ఎన్నో సీరియల్స్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ భక్త కన్నప్ప సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఏకంగా 90 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు సమర్పణలో విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ […]

రాజ‌కీయాల్లోకి స‌మంత‌! సినిమాలు వ‌దిలేస్తుందా?

నటనకు విరామం తర్వాత సమంత రూత్ ప్రభు రాజకీయాల్లో చేరనున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం చేస్తోంది హిందీ మీడియా. అయితే ఇది నిజ‌మా? అంటే మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళ్లాలి. కొద్దిరోజులుగా అనారోగ్య‌ కార‌ణాల‌తో విశ్రాంతి తీసుకుంటున్న సమంతా రూత్ ప్రభు సెప్టెంబ‌ర్ 1న‌ థియేటర్లలోకి వచ్చిన త‌న సినిమా `ఖుషి` విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. నిజానికి సామ్ ఖుషి ప్రాచారంలో పాలుపంచుకోలేక‌పోయింది. ఇటీవ‌లే అమెరికాలో మ‌యోసైటిస్ చికిత్స‌తో కొంత మెరుగైన అనంత‌రం తిరిగి హైద‌రాబాద్ లో అడుగుపెట్టింది. ఆ […]

హీరోయిన్‌ కాకుండానే బాల నటిగా రూ.10 కోట్లు!

సారా అర్జున్‌.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని పాత్ర యుక్త వయసు లో ఉన్నప్పుడు సారా అర్జున్‌ పోషించింది. సారా అర్జున్‌.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన […]

దేవర సైలెన్స్ వెనుక రీజన్ అదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న దేవర సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. యువ సుధ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో తారక్ తో బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూల్ […]

ప్రభాస్ కి, అనుష్క రెసిపీ ఛాలెంజ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రభాస్ గురించి ఫ్యాన్స్ కి తెలిసిన కామన్ విషయం ఏమిటంటే ఫుడ్. ఆయన ఫుడ్ ని ఇష్టంగా లాగించేస్తారు. అంతేకాదు, తనతో పనిచేసిన నటీనటులకు కూడా విపరీతంగా ఫుడ్ పెడుతూ ఉంటారు. ఆఖరికి తన పెదనాన్న కృష్టం రాజు చనిపోయినప్పుడు చూడటానికి వచ్చిన అభిమానులకు సైతం ప్రభాస్ రకరకాల వంటలు వండి, వారు ఇబ్బంది పడకుండా చేశారు. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే ప్రభాస్ […]

మహేష్ – షారుఖ్.. నిజంగా కలుస్తారా?

బాలీవుడ్‌ స్టార్​ హీరో షారుక్​ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు సూపర్ స్టార్​ మహేశ్‌బాబు తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆయన కోరుకున్నారు. అయితే దీనిపై షారుక్​ స్పందించారు. మహేశ్‌తో కలిసి తాను కూడా సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. “థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. ‘జవాన్‌’ నీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నువ్వు ఎప్పుడు […]

డైరెక్ట‌ర్ కాళ్ల మీద‌ప‌డి క్షమాప‌ణ‌లు అడిగిన హీరోయిన్!

వెట‌ర‌న్ న‌టి లైలా ఒక‌ప్పుడు ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. `ఎగిరేపావుర‌మా` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన లైలా చాలా సినిమాల్లో న‌టించింది. త‌మిళ‌..మ‌ల‌యాళ‌..క‌న్నడ భాష‌ల్లోనూ మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఓ బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకున్నారు. అటుపై సినిమాల‌కు దూర‌మయ్యారు. కుటుంబ జీవితంలో అంకిత‌మై మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చింది లేదు. అయితే ఆ మ‌ద్య `స‌ర్దార్` సినిమాతో మ‌ళ్లీ త‌మిళ్ లో కంబ్యాక్ అయ్యారు. ప్ర‌స్తుతం అక్క‌డ […]

అదే చివరి సినిమా కావాలనుకున్నా: పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల గ్లింప్స్, పోస్టర్లను ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ప్రముఖ దర్శకుడు సుజిత్‌ దర్శకత్వంలో వస్తున్న ఓజీ గ్లింప్స్‌ ను విడుదల చేశారు. అలాగే మరో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రం పోస్టర్‌ ను పంచుకున్నారు. పవన్‌ జన్మదినం సందర్భంగా గతంలో ఆయన పలు సినిమా వేడుకల్లో, రాజకీయ […]

రూ.10 లోపు ఖ‌ర్చుతో స్టార్ హీరో పెళ్లి..!

అత‌డు ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన మేటి న‌టుడు. వంద‌ల కోట్ల ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు. ఒక్కో సినిమాకి 100కోట్లు వ‌సూలు చేస్తాడు. కానీ అత‌డి పెళ్లి కేవ‌లం రూ.10 ఖ‌ర్చుతో పూర్త‌యింది. అయితే అందుకు కార‌ణ‌మైన ప‌రిస్థితులు ఏమిట‌న్న‌ది ఆరా తీస్తే షాకిచ్చే విష‌యాలే తెలిసాయి. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే – మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇరా ఖాన్ -జునైద్ ఖాన్ […]

రాధిక ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమాలో రాధిక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకులకు అభిమాన హీరోయిన్‌ గా మారిపోయింది. చాలా మంది రాధిక అంటూ నేహా శెట్టి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో నేహా శెట్టికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. డీజే టిల్లు సినిమా లో తెలంగాణ యాసలో మాట్లాడి పక్కింటి పిల్ల అనిపించుకున్న ఈ అమ్మడు ఈసారి ఏపీ ప్రేక్షకులకు […]

న‌వాజుద్దీన్ ప్ర‌యోగం.. హిజ్రా పాత్ర‌లో సుష్‌నే కొట్టేశాడుగా..

ఇటీవ‌ల మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ తన వెబ్ సిరీస్ ‘తాళి’లో గౌరీ అనే హిజ్రా పాత్ర‌లో గొప్ప ప్రభావం చూపింది. లింగమార్పిడి కార్యకర్త శ్రీగౌరీ సావంత్ నిజ‌జీవిత పాత్ర‌ను తెర‌పై పోషించింది సుష్‌. ఈ పాత్ర‌లో త‌న అద్భుత అభిన‌యానికి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అదే త‌ర‌హాలో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో అభిమానులకు స‌ర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ట్యాలెంటెడ్ న‌టుడు మునుపెన్న‌డూ చూడని స‌రికొత్త‌ అవతార్‌లో కనిపిస్తాడు. లింగమార్పిడి (హిజ్రా)కి గురైన యువ‌కుడి పాత్రను […]

లావణ్య, నిహారికల్లో ఎవరు ముఖ్యం.. వరుణ్‌ సూపర్ ఆన్సర్‌

మెగా ఫ్యామిలీ లో పెళ్లి వేడుకకు రంగం సిద్ధం అయింది. వచ్చే నెల లేదా అక్టోబర్‌ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అనే విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం గురించి చాలా రోజులుగా ప్రచారం జరిగింది కానీ చాలా మంది పుకార్లే అనుకున్నారు. నిశ్చితార్థం వరకు కూడా వరుణ్‌, లావణ్య ల ప్రేమ విషయంలో క్లారిటీ రాలేదు. నిశ్చితార్థం ఫోటోలు […]

ఇలా క‌న్ప్యూజ్ చేస్తే ఎలా భామ‌లు?

క‌రీనాక‌పూర్ ఖాన్-అలియాభ‌ట్ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం చాలా ఉంటుంది. ఇద్ద‌రు ఒక త‌రం న‌టులు కాదు. అలియా క‌న్నా క‌రీనా చాలా సీనియ‌ర్. కానీ ఆ బ్యూటీలిద్ద‌రు చాలా క్లోజ్ అని తెలుస్తోంది. ఇద్ద‌రు తొలిసారి ‘ఉడ‌తా పంజాబ్’ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. సాధార‌ణంగా హీరోయిన్ల కాంబినేష‌న్స్ అనేవి పెద్ద‌గా సెట్ కావు. చాలా రేర్ గా జ‌రుగుతుంటాయి. […]

యష్ కోసం తెలుగు నిర్మాతల ఆరాటం..!

కన్నడ పరిశ్రమ రేంజ్ పెంచిన హీరో యష్ K.G.F తో సంచలనాలు సృష్టించాడు. ఆ సినిమా నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేలా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ సినిమా బాటలో చాలా సినిమాలు కన్నడ సినిమా స్టామినా చూపించాయి. KGF 1, 2 రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి. కె.జి.ఎఫ్ తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా హీరోగా యష్ కూడా భాషతో […]

ట్రోల‌ర్ల‌నే చెడుగుడు ఆడేసిన శిల్పాశెట్టి!

ఇన్ స్టా క్వీన్..బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి పై ట్రోలింగ్ కొత్తేం కాదు. ఏదో విష‌యంలో అమ్మ‌డు ట్రోలింగ్ బారిన ప‌డుతుంటుంది. అప్పుడ‌ప్పుడు వాటికి ధీటుగానూ బ‌ధులిస్తుంది. త‌న త‌ప్పు లేన‌ప్పుడు మాత్రం ఊరికునే టైప్ కాదు. చెడుగుడు అడేస్తుంది. అందులోనూ ఆధారాలుంటే అస్స‌లాగ‌దు. తాజాగా స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శిల్పాశెట్టి ఇంటిప‌రిస‌రాల్లోనే జాతీయ జెండా ఎగ‌ర‌వేసిన వీడియో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో శిల్పా శెట్టి చెప్పులు వేసుకుని జెండా ఎగ‌రేసింది. దీంతో ట్రోల‌ర్లు […]

స్టార్‌ కిడ్‌ ని పెళ్లాడబోతున్న యంగ్‌ హీరో

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్ విషయం. హీరోలు హీరోయిన్స్‌ తో ప్రేమలో పడటం.. పెళ్లి వరకు వెళ్లడం ఈ మధ్య తరుచు చూస్తూనే ఉన్నాం. దర్శకుడు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం కూడా మనం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూ ఉన్నాం. తాజాగా యంగ్‌ హీరో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఓహ్‌ మై కడవులే సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న యంగ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ పెళ్లి పీటలు ఎక్కేందుకు […]