2లక్షల ఖరీదైన బ్యాగు.. ఆధ్యాత్మిక బోధకురాలిపై ఫైర్
ఆధ్యాత్మిక బోధకురాలు లేదా ఆధ్యాత్మిక సేవికులు అంటే వారికి పబ్లిక్ లో ఉండే ఇమేజ్ వేరు. గురువులు, స్వామీజీలు, మాతాజీలు అంటే సింప్లిసిటీకి నిదర్శనం. వారు భక్తులను విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ధేశించరు. సాధారణ జీవన విధానాన్ని మాత్రమే బోధిస్తారు. కానీ అందుకు భిన్నంగా కనిపించారంటూ ప్రముఖ ఆధ్యాత్మిక బోధకురాలిపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు. పాపులర్ ఆధ్యాత్మిక బోధకురాలు, గాయని అయిన జయ కిషోరి రూ. 2 లక్షల ఖరీదైన డియోర్ బ్రాండ్ బ్యాగ్ తో కనిపించడంపై ఇప్పుడు […]
కాల భైరవ.. మరో ప్రయోగంతో రాబోతున్న లారెన్స్
వైవిధ్యమైన పాత్రలు, సెన్సేషనల్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలకు పేరొందిన నిర్మాత కోనేరు సత్యనారాయణతో లారెన్స్ క్రేజీ సినిమాతో రెడీ అవుతున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు కలసి భారీ ప్రాజెక్ట్ గా ‘కాల భైరవ’ ను తెరపైకి తీసుకువస్తున్నాయి. డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతో 25వ చిత్రాన్ని పూర్తి […]
ఆ క్రెడిట్ వాళ్లకే ఇస్తానంటున్న దుల్కర్..!
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి బాటలో కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా అతను చేస్తున్న తెలుగు సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మహానటితో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ […]
జక్కన్నను మించి త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్లు?
ఒకప్పుడు రాజమౌళి సగటు మాస్ మసాలా సినిమాలు తీసే దర్శకుడు. కానీ ‘మగధీర’ నుంచి ఆయన ప్రయాణం మారిపోయింది. అప్పటిదాకా ఆయన తరం దర్శకులు ఊహించడానికి కూడా భయపడే కథలను ఆయన అద్భుత రీతిలో తెరకెక్కించడం మొదలుపెట్టారు. మగధీర తర్వాత ‘ఈగ’, ఆపై ‘బాహుబలి’ తీసి ఎవ్వరూ అందుకోని స్థాయికి చేరుకున్నారు. ఐతే ఆయన తరం స్టార్ డైరెక్టర్లలో ఎంతో విషయం ఉండి ఇలాంటి భారీ ప్రయత్నాలు చేయలేదని త్రివిక్రమ్ విషయంలో అభిమానులు బాధ పడుతుంటారు. ఇంకా […]
బాలీవుడ్.. ఓ సీక్రెట్ బయటపెట్టిన సాయి పల్లవి
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ సాయి పల్లవి. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయిన టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం మనసుకి నచ్చే కథలకి మాత్రమే సాయి పల్లవి ఒకే చెబుతుంది. మూవీలో క్యాస్టింగ్ ఎవరనేది అస్సలు పట్టించుకోదు. కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయిన సున్నితంగా రిజక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే […]
2000 కోట్ల టార్గెట్.. సూర్య తెలివైన సమాధానం
ఇండియాలోని ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాల సంఖ్య అధికం అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలా ఇప్పుడు తెరకెక్కిన క్రేజీ యాక్షన్ సినిమానే ‘కంగువ’. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా.. మాస్ డైరెక్టర్ శివ రూపొందించిన సినిమానే ‘కంగువ’. పిరియాడిక్ జోనర్‌లో ఫుల్ లెంగ్త్ […]
సూపర్‌స్టార్ అని పిలవొద్దన్న హీరో
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియన్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని యువిక్రియేషన్స్- స్టూడియోగ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయని ప్రచారమవుతోంది. ప్రస్తుతం టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. ఇటీవల ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో స్టార్లకు సంబంధించిన 30 అడుగుల కటౌట్‌ను ప్రదర్శించారు. ఇది ముంబై పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. సూర్య, దర్శకుడు […]
కుమార్తెకు పెళ్లి చేసినా తగ్గేదేలే!
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. `పట్టత్తు యానై` అనే తమిళ సినిమాతో లాంచ్ చేసాడు. ఆ తర్వాత కన్నడలో ప్రేమ బరహా అనే సినిమా చేయించాడు. అటుపై `సొల్లి విడవ` అనే చిత్రం చేసింది. ఇవేవి ఐశ్వర్య రాయ్ కి ఆయా ఇండస్ట్రీలో కొత్త అవకాశాలు తెచ్చి పెట్టలేదు. దీంతో అక్కడ లాభం లేదనుకున్న అర్జున్ టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ఇక్కడ విశ్వక్ సేన్ హీరోగా తానే డైరెక్టర్ […]
రెబల్ కటౌట్ కి.. మెగా మార్క్ విషెస్..!
ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సంచలనానికి మొదటి అడుగు వేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి కన్న కలను నిజం చేసేందుకు తన ఐదేళ్ల కెరీర్ రిస్క్ లో పెట్టి మరీ బాహుబలి సినిమా చేశాడు. ఆ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తెలుగు సినిమా ముఖచిత్రం మారిపోయింది. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ఒక్కడు వేసిన బాటలో మిగతా స్టార్స్ […]
350 మందికి హీరో రోజు అన్నదానం!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది మంది ట్యాలెంటెడ్ నటుల్లో అతడు ఒకరు. సినిమాటోగ్రాఫర్ ఛోటాకే నాయుడు మేనల్లుడు అయినా ఇండస్ట్రీలో తన ట్యాలెంట్ తోనే ఎదిగాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. ధనుష్ లాంటి స్టార్ హీరోతోనూ కలిసి పనిచేస్తున్నాడు. నటుడిగా అతడె ప్పుడు ఖాళీగా లేడు. ఏదో సినిమాతో బిజీగానే […]
యంగ్ టైగర్ తో కూడా నీల్ అదే సెంటిమెంట్!
ప్రశాంత్ నీల్ ఎంత పెద్ద భారీ స్పాన్ సినిమా తీసినా? దాని వెనుక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ సెంటి మెంట్ తోనే? అతడు ఆ తర్వాత స్టోరీ బ్యాక్ డ్రాప్ అల్లుతాడు. కేజీఎఫ్…సలార్ రెండు మదర్ సెంటిమెంట్ ఆధారంగా తీసిన చిత్రాలే. ఆ సెంటిమెంట్ కి తనదైన మార్క్ క్రియేటివిటీతో భారీ స్పాన్ ఉన్న కథగా తీర్చి దిద్దాడు. ఇది అతడి స్పెషాల్టీ. కొన్ని లాజిక్కులు పక్కన బెడితే మదర్ సెంటిమెంట్ లో అతడు అద్భుతమైన […]
సినిమాలో తప్పులు చూపిస్తే పార్టీ ఇస్తా
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇంటరెస్టింగ్ డ్రామాతో ఈ మూవీ కథాశం ఉండబోతోందని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ […]
రజినీకాంత్ మరో రిస్క్?
ఇళయదళపతి విజయ్ తో ‘ది గోట్’ మూవీ చేసిన వెంకట్ ప్రభు తమిళనాట కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఒక్క తమిళంలో తప్ప ఏ భాషలో కూడా హిట్ కాలేదు. అలాగే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. వెంకట్ ప్రభు సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఉంటాయి. అలాగే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కూడా కనిపిస్తాయి. ‘మానాడు’ సినిమా అతని దర్శకత్వం ప్రతిభని చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకట్ ప్రభు ఏకంగా సూపర్ […]
‘జై హనుమాన్’ కోసం కాంతార..!
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు సినిమాల్లో చిన్న సినిమా హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి మరే సినిమా సాధించని వసూళ్లు హనుమాన్ సినిమా సాధించడం జరిగింది. పాన్ ఇండియా రేంజ్‌లో హనుమాన్ కి మంచి స్పందన వచ్చింది. అందుకే దర్శకుడు ప్రశాంత్ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ ను రూపొందించే పనిలో ఉన్నాడు. జై హనుమాన్‌లోనూ తేజ సజ్జా ఉంటాడని ఇప్పటికే […]
సాయి పల్లవితో మణిరత్నం అంత మాట అనేశాడేంటి..?
సౌత్ సినిమాలకు ప్రస్తుతం నార్త్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ రూపొందిన ప్రతి సినిమాను అక్కడ డబ్బింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. రెండు దశాబ్దాల క్రితం సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులకు పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో తమిళ దర్శకుడు మణిరత్నం చేసిన ఎన్నో సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆదరించారు. మణిరత్నం సినిమాలను హిందీ ప్రేక్షకులు ఆదరించిన మాదిరిగా మరే దర్శకుడి సినిమాలను వారు అప్పట్లో ఆదరించలేదు. […]
ప్రభాస్ రాబోయే సినిమాలు.. అక్కడ ఊహించని డిమాండ్
ఇండియాలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ దూసుకుపోతున్నాడు. అతని ఫ్లాప్ సినిమా కూడా ఈజీగా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇక హిట్ పడితే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఏకంగా 1150 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీనికంటే ముందు వచ్చిన ‘సలార్’ మూవీ ఏవరేజ్ టాక్ […]
పాట సెట్ కోసం 20 కోట్లా శంకర్ జీ!
శంకర్ సినిమా అంటే? బడ్జెట్ తడిపి మోపుడవుతుందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకసారి సెట్స్ కి వెళ్లిన తర్వాత శంకర్ రాజీ పడరు. తాను అడిగినవన్నీ సమకూర్చాల్సిందే. నిర్మాణ పరంగా ప్రతీది రిచ్ గా ఉండాలని చూస్తారు. వేసే సెట్స్ దగ్గర నుంచి ..నటీనటుల వరకూ ప్రతీది భారీ కాన్వాస్ పైనే ఉంటుంది. ఆయన ఏ సినిమా చేసిన భారీ సెట్లు తప్పనిసరి. ముఖ్యంగా పాటల కోసం ఆయన కోంస ఆయన వేయించే సెట్లు చూస్తే దిమ్మతి […]
నెలకో సినిమా రెడీ చేస్తోన్న సితార
తెలుగు సినిమా రంగంలో మొన్నటి వరకు స్పీడ్ తగ్గించిన నిర్మాణ సంస్థలు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ సినిమాలు రూపొందుతోన్నాయి. ముఖ్యంగా కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం భారీ బడ్జెట్ చిత్రాలకే మొగ్గు చూపుతుండగా.. కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు మాత్రం చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మంచి లాభాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ‘దేవర’ చిత్రాన్ని ఏపీ […]
జానీ మాస్టర్ నాతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు! అనీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో భాగంగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన కొరియోగ్రఫీ గాను జాతీయ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆరోపణల నేపథ్యంలో ఆ అవార్దును రద్దు చేసారు. అవార్డు కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా? అవార్డు రద్దవ్వడంతో బెయిల్ క్యాన్సిల్ పిటీషన్ వేసారు. విచారణ నిమిత్తం జానీ మాస్టర్ జైలు నుంచి కోర్టుకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో […]
పవన్ డెన్‌లోకి ఎంటరైన ప్రకాశ్ రాజ్
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సైతం యాక్టివ్ అయిన ఆయన.. గత ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ హడావిడిలోనే సినిమాలకు పవర్ స్టార్ దూరం అయ్యారు. దీంతో ఆయన అభిమానులు నిరాశగా ఉండిపోయారు. పాలిటిక్స్ చేస్తూనే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేయాలని పవన్ కల్యాణ్ […]