ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ కపుల్స్.. సెట్టయితే కేక..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోన్న మూవీ ‘స్పిరిట్’ అని చెప్పొచ్చు. ‘యానిమల్’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేయబోయే మూవీ ఇదే కావడంతో ఈ చిత్రంపైన ఎక్కువ ఫోకస్ పడింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. కాని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా […]
‘దేవర’ ఫస్ట్ షో.. చివరి నిమిషంలో ఇదెక్కడి షాక్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర-1 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 1 AM షోలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో, ఆ షో కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. అర్ధరాత్రి షోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముందు […]
మసాయి…పిగ్మీస్ తెగల మధ్య సూపర్ స్టార్ ట్రైనింగ్!
సూపర్ స్టార్ మహేష్ కఠినమైన ట్రైనింగ్ కి సన్నధం అవుతున్నాడా? మసాయి-పిగ్మీస్ తెగల మధ్య స్పెషల్ ట్రైనింగ్ కి వెళ్తున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి. మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నయి. అలాగే మహష్ జపాన్ లో పాత్ర కోసం కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. రాజమౌళి అదేశాల మేరకు జపాన్ బృందంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ […]
ప్లాన్ మారుస్తున్న ఎన్టీఆర్… ఇకపై ఇదే ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆరేళ్ళు అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ 2018లో రిలీజ్ అయ్యింది. మరల 2024లో ‘దేవర పార్ట్ 1’తో తారక్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్ కూడా ‘దేవర పార్ట్ 1’ సినిమాని […]
పవర్ఫుల్ లీడర్ తో నమ్రత.. వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ యాక్టివిటీస్ లో కూడా భాగం అవుతున్నారు. అలాగే రెగ్యులర్ గా ఫ్యామిలీ సెలబ్రేషన్స్, వెకేషన్స్ కి సంబందించిన పిక్స్ కూడా నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ కూడా ఇన్ స్టాగ్రామ్ లో నమ్రతని ఫాలో అవుతారు. ఎంబి ఫౌండేషన్ ద్వారా జరిగే సామాజిక […]
అలనాటి మేటి తార మొదటి రమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ట్రెండు మారుతున్న కొద్దీ సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్లకు ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు చిత్రాలలో పెద్దగా లేదు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో తప్ప హీరోలను హైలెట్ చేసే సినిమాలలో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా చాలా వరకు గ్లామర్ కే పరిమితం అవుతుంది. అయితే ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఎందరో ఉన్నారు. […]
శంకర్ కాపీ కౌంటర్.. దేవర vs కంగువా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ చివరిగా ‘భారతీయుడు 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తోన్న ‘గేమ్ చేంజర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 20కి ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శంకర్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. తమిళంలో ‘నవ యుగ నాయగన్ వేల్ పారీ’ అనే నవల హక్కులని కొనుగోలు చేశారు. ఈ నవలని […]
‘ఓజీ’ కోసం ఆ స్టార్ పాట చాలా స్పెషల్
పవన్ కళ్యాణ్ ఒక వైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉన్నా ఆయన సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన నేటి నుంచి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మంగళగిరిలోనే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నాడు. ఒక వైపు పరిపాలన పరమైన పనులతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ మరో వైపు రోజులో కొంత భాగంను షూటింగ్ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా […]
‘సాగర సంగమం’ టైమ్‌లెస్ క్లాసిక్ ఎందుకు?
కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన స్టార్లలో ఒకరిగా చరిత్రకెక్కారు. తనదైన విలక్షణ నటన, హావభావాలతో, సాంకేతిక అన్వేషకుడిగా చిత్రపరిశ్రమలో అత్యంత ప్రభావం చూపిన అసాధారణ ప్రతిభావంతుడు. కెరీర్ మొత్తంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించిన మేటి నటుడు. నిర్మాతగా, దర్శకుడిగా, డ్యాన్సర్‌గా అతడు తనను తాను నిరూపించాడు. కమల్ హాసన్ నటించిన సినిమాలలో సాగర సంగమం ప్రత్యేకత గురించి ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. 1983 నాటి క్లాసిక్ మూవీలో కమల్ హాసన్, […]
మంత్రి హోదాలో తారక్ నోట పవన్ జీ!
మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ కేవలం ఓ నటుడు మాత్రమే. దర్శకులు చెప్పింది చేయడం మాత్రమే అతడి పని. షూటింగ్ కి వెళ్లడం సాయంత్రం ముగించుకుని రావడం. అటుపై ఇతర పనుల్లో బిజీ అవ్వడం అతడి షెడ్యూల్. కానీ నేడు అతడు ఓ రాజకీయ నాయకుడు. ఓ పార్టీకి అధ్యక్షుడు. అన్నింటికి మించి కూటమి ప్రభుత్వంలో మంత్రి హోదా సాధించిన నాయకుడు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల గౌరవ మర్యాదలు […]
`వార్-2` గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `నాటు నాటు` పాటలో ఏ రేంజ్ లో పోటీ పడి డాన్సు చేసారో తెలిసిందే. ఇద్దరి మధ్య రాజమౌళి అలాంటి పాట ఒకటి ప్లాన్ చేసాడు? అని రిలీజ్ వరకూ తెలియ నే తెలియదు. థియేటర్లో ఆడియన్స్ కి ఆ పాట ఓ బిగ్ సర్ ప్రైజ్ ని అందించింది. చరణ్-తారక్ మధ్య పోటీ ఆ రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఏమాత్రం గెస్ చేసి ఉండరు. […]
ఎమ్మీ అవార్డ్స్ 2024: తెనాలమ్మాయా మజాకానా?
తెనాలమ్మాయి, పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల పేరు ఇటీవల మార్మోగుతోంది. శోభిత నటించిన చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నటిగా తనకు గొప్ప పేరు తెచ్చిపెడుతున్నాయి. ఒక తెలుగు నటి అంతర్జాతీయ స్టాండార్డ్ పెర్ఫామర్‌గా రూపుదిద్దుకోవడం అందరి మెప్పు పొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు శోభిత ధూళిపాల నటించిన `ది నైట్ మేనేజర్` ప్రతిష్ఠాత్మక ఎమ్మీ నామినేషన్ కి వెళ్లడం సంచలనంగా మారింది. ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు..`కు ఆస్కార్ అవార్డ్ దక్కడంతోనే తెలుగువారి […]
‘తప్పు చేస్తే ఒప్పుకోండి’.. జానీ మాస్టర్ కు మనోజ్ సలహా!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అవ్వడం.. పోలీసులు అతడిని అరెస్టు చేయడం.. ఇదంతా తెలిసిందే. గోవాలోని అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత రీసెంట్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రావడం హాట్ టాపిక్ గా మారింది. […]
దేవర స్పెషల్ చిట్ చాట్.. ఆ ఇద్దరు యువ హీరోలతో భయం గురించి ఎన్టీఆర్..!
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే ముంబైలో ప్రమోషన్స్ మొదలు పెట్టగా లేటెస్ట్ గా ఈ సినిమా కోసం యువ హీరోలిద్దరితో కలిసి స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేశారు. యువ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కి అభిమానులే. ఈ […]
తమిళ యాసలో అదరగొట్టిన తారక్-జాన్వీ
తమిళనాడు నుంచి వచ్చి టాలీవుడ్ లో తెలుగు మాట్లాడిన హీరోలు తక్కువమంది ఉన్నారు. అందులో అగ్ర హీరో సూర్య సోదరుడు కార్తీ స్పష్ఠంగా తెలుగు మాట్లాడగలరు. కానీ సూర్యకు తెలుగు రాదు. తెలుగు హీరోల్లో చాలామందికి చెన్నై(నాటి మద్రాసు)తో ఉన్న అనుబంధం కారణంగా తమిళం స్పష్ఠంగా మాట్లాడగలరు. నాగచైతన్య, రామ్ చరణ్, బన్ని, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా చాలా మంది తెలుగు అగ్ర హీరోలు తమిళ యాసను స్పష్ఠంగా పలకగలరు. ఇదే వేదికపై దేవర కథానాయిక జాన్వీ […]
అవతార్ దర్శకుడు కామెరూన్ మరో సంచలనం
టైటానిక్, టెర్మినేటర్ 2, అవతార్, అవతార్ 2 లాంటి సంచలన చిత్రాలను తెరకెక్కించారు జేమ్స్ కామెరూన్. తదుపరి అవతార్ సిరీస్ లో వరుసగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అవతార్ 3 చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఇంతలోనే ఇప్పుడు కామెరూన్ నుంచి వచ్చిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈసారి అతడు జపాన్ పై అణుబాంబ్ దాడి పర్యవసానాలపై సినిమా తీస్తూ వార్తల్లోకొచ్చారు. జేమ్స్ కామెరాన్ త్వరలో మార్కెట్లోకి రానున్న `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా` పుస్తకం హక్కులను […]
‘పుష్ప-2’ను కొట్టిన ‘దేవర-1’
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర-పార్ట్ 1’ ఒకటి. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతకంతకూ ఆ అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. ఐతే ఈ మధ్యే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయగా.. అది కొంచెం హైప్‌ను తగ్గించినట్లు అనిపించింది. ‘ఆచార్య’ సినిమాతో పోలికలు కనిపించడంతో పాటు ట్రైలర్లో హై మూమెంట్స్, కొత్తదనం కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశ చెందారు. ఐతే రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన […]
విరాట్ – అనుష్క, చరణ్ – ఉపాసన.. ఇప్పుడు రణ్‌వీర్ – దీపిక
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే ఇటీవలే తల్లిదండ్రులు అయిన విషయం తెల్సిందే. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకునే ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. సాధారణంగా సెలబ్రెటీలు తమ పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వారే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వారి పిల్లల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ కొందరు స్టార్ కపుల్ మాత్రం ఏళ్లకు […]
జానీ మాస్టర్ వివాదం.. చిన్మయి, పూనమ్ స్ట్రాంగ్ కౌంటర్
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేదించాడని అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. యువతి జానీ మాస్టర్ పై చాలా రకాల ఆరోపణలు చేసింది. గత ఐదేళ్లుగా ఇబ్బంది కలిగిస్తున్నాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించాడని యువతి ఆరోపణలు చేసింది. వీటిని లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసింది. దీనిపై […]
మణిపురి ఘర్షణల్లో తండ్రిని వెతికే చిన్నారి కథ
రాజ్ కుమార్ హిరాణీ, మీరా నాయర్, ఫర్హాన్ అక్తర్ వంటి సుప్రసిద్ధ దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన ప్రతిభావంతురాలు మణిపురి ఫిలింమేకర్ లక్ష్మీప్రియా దేవి. లక్ష్య, లక్ బై ఛాన్స్, తలాష్ వంటి చిత్రాలకు అసిస్టెంట్. గత సంవత్సరం దహాద్ సిరీస్‌కి లక్ష్మీ ప్రియా పని చేసారు. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు సహాయ దర్శకురాలిగా కొనసాగారు. ఇప్పుడు లక్ష్మీ ప్రియా తన తొలి చిత్రం `బూంగ్` కారణంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. […]