#ChaiSam : విడాకుల వల్ల చిన్నప్పుడే ఇబ్బంది పడ్డ చైతూ!


నాగ చైతన్య ను చూడగానే పక్కింటి కుర్రాడు.. ఒక ఇన్నోసెంట్ అబ్బాయి అనిపిస్తుంది. టాలీవుడ్ లోని ఎక్కువ శాతం హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా మంది ఫేస్ ల్లో స్టార్స్ అనే గర్వం కనిపిస్తుంది. కొందరి ఫేస్ ల్లో డబ్బున్న గర్వం కనిపిస్తూ ఉంటుంది. కాని నాగ చైతన్య విషయంలో మాత్రం అలా కనిపించద. చాలా ఇన్నోసెంట్ గా మాత్రమే చైతూ కనిపిస్తాడు. చైతూ ను చూసిన వెంటనే ఒక హీరో అనే అభిప్రాయం కంటే ముందు ఒక మంచి కుర్రాడు అనే ఫీల్ కలుగుతుంది. చిన్నప్పటి నుండి మొహమాటస్తుడు.. చిన్నతనంలోనే ఎదుర్కొన్న పరిస్థితులు ఆయన్ను అలా మార్చాయేమో అంటూ కొందరు అంటూ ఉండేవారు. చిన్నప్పుడు ఏ కారణాల వల్ల అలా అయ్యాడు అనే ప్రచారం జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ జీవితంలో చవి చూడాల్సి వచ్చింది.

చాలా మొహమాటస్తుడు.. కొన్ని విషయాల పట్ల చాలా రిజర్వ్ గా ఉండే నాగ చైతన్య ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటాడు అనేది కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమంతతో విడి పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. ఆ బాధ ను చైతూ ఎంతగా ఫీల్ అవుతున్నాడో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో నాగ చైతన్య చిన్నప్పుడు పడ్డ మానసిక సంఘర్షణ గురించి కూడా చర్చించుకుంటున్నారు. నాగార్జున మరియు లక్ష్మి గార్లు చైతన్య పుట్టిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. రెండు ఫ్యామిలీలు కూడా చైతన్యను అక్కున చేర్చుకునేవారు. తల్లి లక్ష్మి గారు అమెరికా వెళ్లి పోవడంతో కొన్నాళ్లు అక్కడకు వెళ్లిన చైతూ కొన్నాళ్లు హైదరాబాద్ లోనే ఉన్నాడు.

ఆ సమయంలో తండ్రి తల్లి కలిసి లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న వారు చెబుతున్నారు. ఆ వయసు పిల్లలు తల్లిదండ్రులు విడిపోతే విషయం ఏంటో అర్థం కాక చాలా మానసిక సంఘర్షణకు గురి అవ్వడం జరుగుతుంది. చైతూ అప్పట్లోనే తల్లిదండ్రుల విడాకుల వల్ల ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది మళ్లీ చైతూకు ఉండవద్దని అంతా ఆశించారు. కాని చైతన్య సమంత నుండి విడాకులు తీసుకోవడం వల్ల మళ్లీ అదే ఫీలింగ్ అతడికి తప్పలేదు అంటూ అభిమానులు కొందరు ఎమోషనల్ అవుతున్నారు. సమంత మరియు చైతన్య ల జోడీ చూసిన సమయంలో చైతూ చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలు మానసిక సంఘర్షణకు తెర పడ్డట్లు అయ్యిందని చాలా మంది అనుకునే వారు. ఇప్పుడు మళ్లీ విడాకుల వల్ల చైతూ మానసికంగా ఆవేదన పడుతున్నాడు.