జగన్ హయాంలో ఫాసిస్టు పాలన నడుస్తోంది: చంద్రబాబు ధ్వజం

ఏపీ సీఎం జగన్ పాలన ఫాసిస్ట్ పాలనను తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ అండతో వైసీపీ శ్రేణులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు చేసిన దాడిని చంద్రబాబు ఖండించారు. జగన్ అండ చూసుకుని కేసులు ఉండవనే ధైర్యతో వీరంతా రెచ్చిపోతున్నారు. జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అన్నారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని మండిపడ్డారు. ప్రతిరోజూ ఎక్కడోచోట ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అదుపుతప్పింది. వైసీపీ నేరగాళ్ల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ మేల్కొని నేరాలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.