రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణకాష్టం చేస్తున్నారు: చంద్రబాబు

ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేశారని.. రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణ కాష్టం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాష్టికానికి టీడీపీ కార్యకర్త సోమయ్య బలైపోయాడని.. ఇందుకు సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సోమయ్య మృతి పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు చేస్తారు? అని మండిపడ్డారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి మృతుని కుటుంబానికి భరోసా కల్పించాల’ని డిమాండ్‌ చేశారు.

నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య ఘటనపై లోకేశ్ స్పందించారు. మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగకుండా గన్‌ కంటే ముందే జగన్‌ వస్తాడనే కబుర్లు చెప్పారని జగన్ ఎప్పుడు ఎక్కడున్నారని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడోచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అనూషను విష్ణువర్ధన్‌ రెడ్డి అత్యంత కిరాతకంగా హత్య చేశాడని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.