టీడీపీ అధినేత చంద్రబాబుకి ‘స్టే’ సిద్ధమవుతోందా.?

కర్నూలులో ఎన్440కె వైరస్ వుందనీ, అది రాష్ట్రమంతా ప్రమాదకర రీతిలో విస్తరించేసిందనీ టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై, కేసు నమోదైంది. తప్పుడు సమాచారాన్ని మీడియా ముఖంగా చెప్పి, ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యారంటూ చంద్రబాబు మీద కేసులు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు, ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకేమంది.? ‘స్టే బాబు’కి మరో ‘స్టే’ రెడీ.. అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో సెటైరికల్ మీమ్స్ షురూ చేశారు.

అసలు ఏ కేసులో అయినా ‘స్టే’ ఎలా వస్తుంది.? అచ్చెన్నాయుడు అరెస్టయితే, వెంటనే ఎందుకు ఉపశమనం దక్కలేదు.? కొల్లు రవీంద్ర విషయంలో ఏం జరిగింది.? ఇలా చెప్పుకుంటూ పోతే, ఆయా కేసుల్లో తీవ్రతను బట్టి, అక్కడ విచారణాధికారులు చూపించే ఆధారాల్ని బట్టే.. న్యాయస్థానం ఆయా కేసుల్లో స్టే ఇవ్వాలా.? వద్దా.? అన్నది తేల్చుతుంది. ఇక, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారనే గొప్ప పేరుందనుకోండి.. అది వేరే చర్చ. మరి, ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది.? చంద్రబాబు, ఇటీవల అమరావతి స్కాం కేసులో ఏపీ సీఐడీ నోటీసులపై కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నట్లే, ఈసారి కూడా చేస్తారా.? అంటే, అదే జరుగుతుందన్నది వైసీపీ జోస్యం. నిజానికి, విచారణ సంస్థలు పక్కా ఆధారాలతో నోటీసులు ఇస్తే, స్టే రావడం అనేది అంత తేలిక కాదు.

అధికార పక్షమే, అర్థం పర్థం లేని కేసులు పెట్టి, పోలీసు వ్యవస్థతో ఆటలాడుకుంటోందన్నది కొందరు రాజకీయ పరిశీలకుల అనుమానం. ఎవరి గోల వాళ్ళదే. కరోనా నేపథ్యంలో ఈ కంగాలీ రాజకీయ కక్ష సాధింపుల వ్యవహారమేంటి.? నోటీసులు చంద్రబాబుకి అందాలి, ఆ తర్వాత చంద్రబాబు వాటిపై స్పందించాలి. అన్నట్టు, సీఎం వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన కేసులో, దేవినేని ఉమకు న్యాయస్థానం అరెస్టు నుంచి ఊరటనిచ్చిన వి