పంచాయతీ ఎన్నికలు ఓ అవకాశం.. తాడోపేడో తేల్చుకుందాం: చంద్రబాబు

‘పంచాయతీ ఎన్నికలు మంచి అవకాశం.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో అన్నారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులు అందరూ నామినేషన్లు వేయాలని సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని అన్నారు. బైండోవర్ కేసులు, అపహరణలను సహించేది లేదని అన్నారు.

గ్రామాలను వైసీపీ నాయకులు రణరంగంగా మార్చారని దుయ్యబట్టారు. వాలంటీర్ల ద్వారా ప్రలోభాలు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. గ్రామాలు వైసీపీ గూండాల చేతిలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఎవరికీ భయపడొద్దని అన్నారు. వైసీపీ గూండాల నుంచి పార్టని కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీ నాయకులదే అన్నారు. వైసీపీ నేతల్లోకి గ్రామాలు వెళ్తే కన్నీరే మిగుల్తుందని చంద్రబాబు అన్నారు.