సీనియర్ నటుడు చంద్రమోహన్ తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు. 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగు పెట్టిన చంద్రమోహన్ ఆన్ లైన్ ద్వారా కొందరు మీడియా వారితో మాట్లాడాడు. ఆ సందర్బంగా చంద్రమోహన్ పలు విషయాలను వెళ్లడించాడు. 55 ఏళ్ల పాటు తన సినీ కెరీర్ ను కొనసాగించినట్లుగా ఆయన పేర్కొన్నాడు. 950 సినిమాలకు పైగా చేసినట్లుగా కూడా పేర్కొన్నాడు. అనారోగ్య కారణాలు మరియు కరోనా వల్ల తాను గత కొన్నాళ్లుగా కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు అంటూ పేర్కొన్నాడు. ఇకపై కూడా సినిమాలు చేయబోను అంటూ చెప్పుకొచ్చాడు.
వర్క్ మీద పడి ఆరోగ్యం విషయంలో పూర్తిగా అశ్రద్ద పెట్టాను. అందుకే ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. రాఖి సినిమా నటించి అటు నుండి అటు ఆసుపత్రికి వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. నా వల్ల కొన్ని సినిమా లు ఆలస్యం అయ్యాయి. షూటింగ్ క్యాన్సిల్ అయ్యి ఆర్థికంగా నిర్మాతలకు నష్టం మిగిలింది. అందుకే ఇకపై తాను సినిమాల్లో నటించి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సినిమా షూటింగ్ లు చేయలేక పోయే అవకాశం ఉంది అందుకే సినిమాలు చేయాలని భావించడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.