డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రెటీలు మళ్లీ మళ్లీ విచారణకు హాజరు అవుతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం విచారణకు హాజరు అయిన సెలబ్రెటీలు తాజాగా మళ్లీ ఈడీ ముందు విచారణకు హాజరు అవుతున్నారు. ఇటీవలే పూరి ని 11 గంటల పాటు అధికారులు విచారించారు. ఎక్కువ శాతం సౌత్ ఆఫ్రికాకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించడానికి కారణం ఏంటీ అనే విషయాలపై ఆయన్ను ప్రశ్నించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
పూరి తర్వాత ఇదే కేసులో ఛార్మిని కూడా విచారించారు. వీరిద్దరు నిర్మాణ సంస్థ భాగస్వామ్యులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి భాగస్వామ్యం కొనసాగుతోంది. ఛార్మి కి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయని బలమైన ఆధారాలు ఉన్నాయట. అందుకే ఆమెను 8 గంటల పాటు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ అలవాటు ఉందా అనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకున్నారట. మొత్తానికి వీరిద్దరి విచారణతో ఇతరులు టెన్షన్ పడుతున్నారు.