రీమేక్ తో పాటు బాబి సినిమాని సైమల్టేనియస్ గా!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి ఆచార్యని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలు పడుతుందా? లేదా? అన్నదానిని కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో నటిస్తారు. ఇది చిరు ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా.

ఆచార్య షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్రాన్నే ముందుగా పట్టాలెక్కించాలని చిరు భావిస్తున్నారు. అటు మెగాస్టార్ తో తదుపరి మూవీ కోసం డైరెక్టర్ బాబి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కి స్క్రిప్ట్ వినిపించి లాక్ చేసారు. బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసి బాబి వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లూసిఫర్ రీమేక్ తో పాటు ఒకేసారి సెట్స్ కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు మరోవైపు ప్రచారం సాగుతోంది.

ఈనేపథ్యంలో బాబి మరోసారి నేను వెయిటింగ్ అంటూ చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే మెగాస్టార్ ని ఓ అభిమానిగా డైరెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మెగాస్టార్ 150 సినిమాల్లో నటించినా ఆయనలో ఉత్సాహం మాత్రం ఇంకా ఎక్కడా తగ్గలేదు.

అర్ధరాత్రి పూట ఆయన సినిమాలు చూస్తుంటారు. ఆ సినిమాల్లో సన్నివేశాల గురించి నైట్ మెసేజ్ లు పెడుతున్నప్పుడే అర్ధమైంది. నిజంగా ఆయనకు సినిమాలంటే ఎంత ఆసక్తో అర్ధమవుతోంది. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు..ఎంతో నేర్చుకున్నట్లు బాబి తెలిపారు.