బుట్టబొమ్మ హగ్గు కోసం ఆచార్యుడి చిలిపి అల్లరి

మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. దీంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆయన అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తించడంతో ఎప్పుడెప్పుడు ‘ఆచార్య’ థియేటర్లలో చూడాలా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది. సినిమా రిలీజ్ కు మరో మూడు రోజులు మాత్రమే వుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల .ఓరు పెంచేశారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే చిరు కొంటె చేష్టలతో అల్లరి చేయడం పలువురిని షాక్ కు గురిచేసింది. మీడియా సమావేశం అంటే హుందాగా కనిపించే చిరు మునుపు ఎన్నడూ లేని విధంగా స్టేజ్ పై చేరి కొంటె చేష్టలతో అల్లరి చేయడం షాకిస్తోంది.

చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చిలిపిగా వ్యవహరిస్తూ వుండే మెగాస్టార్ ‘ఆచార్య’ ప్రెస్ మీట్ లో మాత్రం కొంటె చేష్టలతో రెచ్చిపోయారు. ఇటీవల జరిగిన ‘మిషన్ ఇంపాజిబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాప్సీతో కలిసి నటించాలని వుందని స్టేజ్ పైనే చెప్పేసిన చిరు గతంలో ‘రచ్చ’ ఫంక్షన్ లోనూ తమన్నాతో కలిసి హంగమా చేశారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘ఆచార్య’ ప్రెస్ మీట్ లో బుట్టమొమ్మపై మనసు పడ్డ చిరు చిలిపి అల్లరితో అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేశారు.

ప్రెస్ మీట్ అనంతరం మీడియా ఫొటో గ్రాఫర్స్ బృందం ఫోటోలు తీసేందుకు ముందుకొచ్చింది. ఇందులో కొరటాల శివ రామ్ చరణ్ చిరంజీవి పాల్గొన్నారు. ఆ తరువాత చరణ్ పూజా హెగ్డే చిరంజీవిలు ఫొటోలకు గ్రూపుగా పోజులిచ్చారు.

మరోసారి ఫొటోలకు పోజులివ్వమని పూజా హెగ్డేని ఫొటోగ్రాఫర్స్ పిలిస్తే పూజా హెగ్డే పట్టించుకోలేదు. దీంతో అవకాశం చిక్కిందనుకున్నారో ఏమో కానీ చిరు రంగంలోకి దిగి పూజా హెగ్డేని ఫొటోల కోసం మీడియా పిలుస్తోందని సైగ చేశాడు. ఇంతలో చరణ్ కూడా వస్తుండటంతో నువ్వు వద్దు అక్కడే వుండు అంటూ సైగ చేశాడు చిరు.

దీంతో పూజా హెగ్డే సిగ్గుతో సిగ్గుల మొగ్గైంది. చిరు కొంటె చూపులకు సిగ్గుపడింది. నాతో ఫొటోలు దిగవా న్నట్టుగా చిరు .. పూజాకు సైగ చేశారు. సై అనడంతో ఇద్దరు కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇదే క్రమంలో చిరు తన చిలిపి అల్లరికి మరింత పదను పెట్టారు. పూజాను తన రెండు చేతులతో బంధించిఏ ప్రయత్నం చేశారు. ఆ తరువాత బాగోదు అని తనంతట తానే వెనక్కి తగ్గడం..తో అక్కడున్న వారంతా స్టేజ్ పై వుంది చిరు యేనా అని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూజా మాత్రం ఈ వీడియోని చూసి తెగ మురిసిపోతోంది.