మెగాస్టార్ తో క్రాక్ దర్శకుడు.. వర్కౌట్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనిను పిలిచి మరీ అభినందించాడు. క్రాక్ చూడగానే చిరంజీవికు తెగ నచ్చేసిందిట. గోపీచంద్ మలినేని లాస్ట్ సినిమా విన్నర్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో మూడేళ్ళ బ్రేక్ తర్వాత ఈ దర్శకుడు క్రాక్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. రవితేజతో బలుపు, డాన్ శీను సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ క్రాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

అలాగే మెగాస్టార్ నుండి ప్రశంసలు రావడంతో గోపీచంద్ ఆనందానికి అవధుల్లేవు. చిరును కలిసిన గోపీచంద్ తన వద్ద ఉన్న స్క్రిప్ట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే గోపీచంద్ కు మైత్రి వాళ్లతో ప్రాజెక్ట్ సెట్ అయింది. నందమూరి బాలకృష్ణతో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది జరిగేలా అయితే కనిపించట్లేదు. మరోవైపు చిరు ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేడు. మరి గోపీచంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.