దేవితో కలిసి పనిచేయనున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఉప్పెన సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఉప్పెన టీమ్ ను కలిసి వారికి తన శుభాకాంక్షలు అందజేశాడు. ప్రత్యేకంగా ఈ సినిమాలో సంగీతంతో ప్రధాన బలంగా నిలిచిన దేవిని అభినందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ అనే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన రీ-ఎంట్రీ చిత్రమైన ఖైదీ నెం 150కు దేవినే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం మరోసారి చిరంజీవి సినిమాకు దేవి సంగీతం అందించనున్నాడు.

బాబీతో చిరంజీవి సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పేరుని రికమెండ్ చేసాడు చిరంజీవి. దేవితో బాబీ జై లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు పనిచేసాడు. దీంతో మరోసారి పనిచేయడానికి హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే మొదలవుతాయని తెలుస్తోంది.