చిరంజీవి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్కడు ఎవరు?

ప్రస్తుతమున్న ట్రెండ్ కు తగినట్లుగా సోషల్ మీడియా వాడకం అనేది అత్యవసరం అయిపోయింది. సోషల్ మీడియాను తగినట్లుగా వాడితే దానివల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గతేడాది లాక్ డౌన్ సమయంలో అటు ట్విట్టర్, ఇటు ఇన్స్టాగ్రామ్ లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండి ఎప్పటికప్పుడు చిరంజీవి సోషల్ మీడియాను వాడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి పోస్ట్ చేసే ఫన్నీ ట్వీట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ట్విట్టర్ లో చిరంజీవి 1 మిలియన్ ఫాలోయర్స్ కు చేరువగా వచ్చారు. అయితే తాను మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని ఒక నెటిజన్ వెలుగులోకి తెచ్చాడు. ఆ ఫాలో అవుతున్న వ్యక్తి ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. ఆ నెటిజన్, శాస్త్రి గారిని ట్యాగ్ చేసి, “మీకు తెలుసా, చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి మీరు” అని ట్వీట్ చేస్తే, “నాకు కొండంత ఆనందంగా ఉంది” అని రిప్లై ఇచ్చారు శాస్త్రి.