చిరంజీవి డ్రైవర్‌ కరోనాతో మృతి

కరోనా టాలీవుడ్‌ వర్గాల వారిని ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కరోనా బారిన పడ్డ మెగాస్టార్ చిరంజీవి డ్రైవర్‌ కరోనాతో మృతి చెందాడు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోనూసూద్‌ కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన తో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించిన రామ్‌ చరణ్‌ ఇప్పటికే స్వయ నిర్భందంలోకి వెళ్లిపోయాడు.

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆ విషయాన్ని స్వయంగా కళ్యాణ్‌ దేవ్‌ ప్రకటించాడు. కళ్యాణ్‌ దేవ్‌ తో పాటు ఆయన సన్నిహితుడికి కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కరోనా వల్ల మెగా ఫ్యామిలీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మెగా స్టార్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ అంతా టెన్షన్‌ గా చూస్తున్నారు.