ఇటివల కరోనాతో మృతి చెందిన రామ్ చరణ్ కారవాన్ డ్రైవర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం అందించారు. కారవ్యాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబానికి చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈమేరకు చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, సురేశ్ కొండేటి చిరు పంపిన చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ..
‘చిరంజీవిగారు ఆపద్బాంధవుడిలా మా కుటుంబానికి కష్టం వచ్చిన ప్రతిసారీ ఆదుకున్నారు. గతంలో నా భర్త బైక్ పై వెళుతూ యాక్సిడెంట్‌కి గురైన సమయంలో ఉపాసనగారికి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారు. అప్పుడూ.. ఇప్పుడూ మా కుటుంబానికి ఆర్థిక కష్టం చిరంజీవి గారు ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. చిరంజీవిగారికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు.
ఇటివలే సీనియర్ నటి పావలా శ్యామలకు లక్ష రూపాయలు అందించి ‘మా’ సభ్యత్వం కార్డుతో నెల నెలా 6వేల పెన్షన్ వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే