చిరును గ్యాంగ్‌లీడర్‌గా చూపబోతున్న బాబీ

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ లో ఎన్నో అద్బుతమైన మాస్‌ పాత్రలను చేసిన విషయం తెల్సిందే. అయితే ఈమద్య కాలంలో ఫుల్‌ లెంగ్త్ మాస్ సినిమాను మాత్రం ఆయన చేయలేదు. అందరి వాడు.. అప్పట్లో గ్యాంగ్‌ లీడర్ వంటి పాత్రల కోసం చిరు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవితో ఒక ఫుల్‌ లెంగ్త్‌ మాస్ సినిమా ను చేసేందుకు దర్శకుడు బాబీ సిద్దం అవుతున్నాడు. చాలా కాలంగా చిరంజీవి డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్న ఈయనకు ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా కన్ఫర్మ్‌ అయ్యి చాలా కాలం అయ్యింది. పలు కథలు విన్న తర్వాత ఒక కథను ఇప్పటికే ఓకే చెప్పిన చిరంజీవి ఇటీవల ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్‌ వర్క్ ను మెచ్చాడట. తన పాత్ర చాలా మాస్ గా ఉందని.. చాలా కాలం తర్వాత ఇంతటి మాస్ పాత్ర తన వద్దకు వచ్చిందని కృతజ్ఞతలు తెలియజేశాడట. మొత్తానికి ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను కూడా చిరంజీవి వ్యక్తం చేశాడని అంటున్నారు. చాలా తక్కువ అనుభవం ఉన్న దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవిని మాస్ గా ఎలా చూపిస్తారు అనేది చూడాలి.