తెలుగు లూసీఫర్‌ లో ఒన్‌ అండ్ ఓన్లీ హీరో

మలయాళ సూపర్‌ హిట్ మూవీ లూసీఫర్‌ ను తెలుగు లో రీమేక్‌ చేయబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి హీరోగా మోహనరాజా దర్శకత్వంలో సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తోంది. చిరంజీవి చేస్తున్న ఆచార్య షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేంది. దాంతో లూసీఫర్‌ హడావుడి మొదలు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. లూసీఫర్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు సెట్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా కోసం ఒక పెద్ద భవనం కావాల్సి ఉంటుందట. ఆ భవనం ను తీసుకుని మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ఇక ఒరిజినల్‌ వర్షన్‌ లో మోహన్ లాల్ మాత్రమే కాకుండా పృథ్వీ రాజ్ కూడా హీరోగా కనిపించాడు. కనుక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రీమేక్ లో పృథ్వీరాజ్‌ పాత్రను మొత్తం కుదించేస్తున్నారట. కథలో ఆ పాత్ర ప్రాముఖ్యత తగ్గించడంతో పాటు ఒక చిన్న నటుడితో ఆ పాత్రను చేయించబోతున్నట్లుగా చెబుతున్నారు. కొందరు మాత్రం తెలుగు లూసీఫర్‌ నుండి పూర్తిగా ఆ పాత్రను తొలగించేసినట్లుగా చెబుతున్నారు. తెలుగు లూసీఫర్ లో మెగాస్టార్‌ చిరంజీవి ఒక్కడే హీరోగా నటించబోతున్నాడని అంటున్నారు.