మెగాస్టార్ చిరంజీవి వరసగా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కడానికి సమయం పడుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశల్లో ఉంది. ఆచార్య పూర్తైన తర్వాత లూసిఫెర్ రీమేక్ ను మొదలుపెడతాడు. సెప్టెంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇక వచ్చే ఏడాది నుండి బాబీ చిత్రంపై ఫోకస్ చేస్తాడు చిరు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. నిజానికి ఈ కథను మొదట విజయ్ దేవరకొండకు చెప్పాడు బాబీ. అయితే విజయ్ తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న కారణంగా ఒప్పుకోలేకపోయాడు.
ఆ కథకే మార్పులు చేర్పులు చేసి బాబీ మెగాస్టార్ కు నరేట్ చేసి ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.