చిరంజీవి మీద ఆ అదనపు బాధ్యత ఉందా?

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. థర్డ్ వేవ్ అంటున్నారు కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. అయితే ఈలోగా సినిమాలు విడుదల చేసుకోవడానికి మన నిర్మాతలకు పెద్దగా ధైర్యం సరిపోవట్లేదు. దానికి కారణం కరోనా కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన కొత్త టికెట్ రేట్లు.

తెలంగాణ వైపు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలోనే వచ్చింది ఇబ్బంది. జగన్ ప్రభుత్వం విధించిన కొత్త రేట్ల పట్ల సినిమా వాళ్ళు ఎవరూ అంత పాజిటివ్ గా లేరు. అయితే ఎవరూ నోరు మెదపడం లేదు.

ఈ నేపథ్యంలో అందరూ చిరంజీవి స్పందన గురించి చూస్తున్నారు. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యతను తీసుకున్నాడు చిరు. మరి చిరంజీవి ఈ విషయంలో పెదవి విప్పుతాడా? జగన్ ను కలిసే చొరవ చూపిస్తాడా అన్నది చూడాలి.