బ్రదర్‌ నాగబాబు.. పవన్‌ ను మర్చిపోవాయా?

ఈమద్య కాలంలో నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. నెట్టింట ఆయన కుటుంబంకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను ఇంకా తాను చేస్తున్న షో లకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా నాగబాబు చిరంజీవి ఫొటోను షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో చిరంజీవి తో పాటు మెగా యంగ్‌ హీరోలు రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు శిరీష్‌ ల ఫొటోలను కూడా ఉంచి.. యంగ్‌ హీరోల కంటే మీరే యంగ్ గా కనిపిస్తున్నారు.. రాబోయే జనరేషన్ లో ఎవరు మిమ్ముల బీట్ చేయలేరుఅన్నయ్యా అంటూ కామెంట్‌ పెట్టాడు.

చిరంజీవితో యంగ్‌ హీరోలను మాత్రమే కంపైర్‌ చేసిన నాగబాబు తమ తమ్ముడు అయిన పవన్‌ కళ్యాణ్‌ పొటోను మర్చి పోయాడా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. నాగబాబు యంగ్‌ హీరోలతో ఆయనకు పోటీ అనే ఉద్దేశ్యంతో కామెంట్‌ చేసి ఉంటాడు అని.. పవన్ సీనియర్ కనుక చిరంజీవిని ఆయనతో పోల్చలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యంగ్‌ హీరోలను మించి హ్యాండ్సమ్ గా ఉన్న చిరంజీవి 65 లోనూ 35 లాగే కనిపిస్తున్నారు అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.