మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తిః చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయన తన సినిమాలు వ్యక్తిగత విషయాలతో పాటు ఎన్నో ఇన్సిపిరేషన్‌ కలిగించే సంఘటనలు సన్నివేశాలు మెసేజ్‌ లను తన ఫాలోవర్స్ తో షేర్‌ చేసుకుంటున్నారు. ఇటీవలే తిరుపతిలో జరిగిన ఏపీ పోలీస్‌ మీట్ లో భాగంగా ఒక తండ్రి తన కూతురు పై హోదాలో ఉండటంతో ఆమెకు విధినినర్వహణలో భాగంగా సెల్యూట్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ ఫొటో చాలా వైరల్‌ అయ్యింది. ఏపీ పోలీస్‌ శాక వారు ఆ ఫొటోను షేర్‌ చేశారు.

ట్విట్టర్‌ లో చిరంజీవి ఆ ఫొటోను షేర్‌ చేశారు. ‘ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు తండ్రి సీఐ శ్యామ్‌ సుందర్‌ గారు కూతురు DSP ప్రశాంతి తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తి ని, గర్వాన్ని, ప్రేమని చూసాను. ShyamSunder garu.. i SALUTE you. మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి’ అంటూ ట్విట్టర్ లో చిరంజీవి ట్వీట్ చేశారు. నిజంగానే ఈ తండ్రి కూతుర్లు కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. కూతురు అంటే చిన్న చూపు చూసే వారికి ఈ ఫొటో చెంప పెట్టు అనడంలో కూడా సందేహం లేదు.