బిజీ షెడ్యూల్ కి మెగాస్టార్ స్మాల్ బ్రేక్

స్టార్ హీరోలు..యంగ్ హీరోలకు షాకిస్తూ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. `సైరా నరసింహారెడ్డి` తరువాత కొత్త తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టిన ఆయన యంగ్ క్రేజీ డైరెక్టర్ లకు వరుసగా ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మునుపెన్నడూ లేనపి విధంగా చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ సెట్ లో బిజీగా వుండటం చూసిన వాళ్లంతా ఈ స్పీడేంది సామీ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. `సైరా` తరువాత చిరు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతోంది. దీంతో ఆయన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో ఐదు క్రేజీ చిత్రాలున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో `ఆచార్య` మూవీ చేస్తున్నారు. దీనితో పాటు మోహన్ రాజాతో `గాడ్ ఫాదర్` కె.ఎస్ రవీంద్ర (బాబీ)తో ఓ సినిమా మెహర్ రమేష్ తో `భోళా శంకర్` చిత్రాలు చేస్తున్నారు. వెంకీ కుడుములతో మరో సినిమా వుంది. దీన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఈ చిత్రాల్లో ఇప్పటికే `ఆచార్య` పూర్తయింది. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీలోనూ విడుదల కానుంది.

మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా `గాడ్ ఫాదర్` మూవీ చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మోహన్ రాజా రూపొందిస్తున్నారు. ఇటీవలే నయనతారకు సంబంధించిన కీలక షూటింగ్ ని పూర్తి చేశారు. చిరుకు సంబంధించిన సన్నివేశాలతో పాటు మరిన్ని కీలక సన్నివేశాల చిత్రీరకరణ జరగాల్సి వుంది. బాబీ చిత్రం కూడా చిత్రీకరణ దశలోనే వుంది. మరో పక్క తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో చిరు చేస్తున్న చిత్రం `భోళా శంకర్`.

కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా మిగతా చిత్రాలతో పాటే చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుస చిత్రాల షూటింగ్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం `భోళా శంకర్`కు సంబంధించిన యాక్షన్ ఘట్టాల షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనగా కీలక యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ కీలక షెడ్యూల్ పూర్తయిన తరువాత హీరో చిరంజీవి స్మాల్ బ్రేక్ తీసుకోమోతున్నారట. గత కొంత కాలంగా వరుస షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్న ఆయన ఫైనల్ గా ఓ స్మాల్ బ్రేక్ తీసుకోబోతున్నారని తెలిసింది. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా విదేశాలకు వెకేషన్ కి వెళ్లాలని చూస్తున్నారట. చిరు ఫ్యామిలీ మాల్దీవ్స్ కి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ కొంత సమయం గడిపిన తరువాతే చిరు తిరిగి హైదరాబాద్ చేకుంటారని కొంత విశ్రాంతి తరువాత మళ్లీ షూటింగ్ లలో పాల్గొంటారని ఇన్ సైడ్ టాక్ .