కొడుకు లవర్ తో అప్పుడు.. అల్లుడి ప్రియురాలితో ఇప్పుడు!

మెగాస్టార్ వరుస సినిమాల జోరు కంటిన్యూ అవుతోంది. ఆచార్య సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాది మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ముంబైలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే భోళా శంకర్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి నెల రోజుల్లోనే ముగించేందుకు దర్శకుడు మెహర్ రమేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో దర్శకుడు బాబీ తో కలిసి చిరంజీవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

వాల్తేరు వీరన్న అనే టైటిల్ తో చిరంజీవి బాబీ ల కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో మరో కీలక పాత్రలో రవితేజ నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటించిన సినిమాల్లో గతంలో రవితేజ నటించాడు. కాని అప్పుడు రవితేజ స్టార్ కాదు.. కానీ ఇప్పుడు రవితేజ ఒక స్టార్ హీరో. ఈ సమయంలో చిరంజీవి మరియు రవితేజ కలిసి నటించడం వల్ల కచ్చితంగా సినిమా కు ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇటీవలే శృతి హాసన్ షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నివేత పేతురాజ్ ను ఎంపిక చేశారట. ఆమె గతంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి చిత్రలహరి సినిమాలో ఇంకా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఇంతకు ముందు కొడుకు రామ్ చరణ్ తో కలిసి నటించిన కాజల్ మరియు తమన్నా లతో రొమాన్స్ చేసిన చిరంజీవి ఇప్పుడు అల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన నివేత పేతురాజ్ తో కలిసి సినిమా చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో కొడుకు తో అల్లుడు తో నటించిన హీరోయిన్ ల తో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించడం అరుదైన రికార్డు మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో తండ్రీ కొడుకులతో ఒక హీరోయిన్ నటిస్తే అది ఒక అద్బుతం అన్నట్లుగా భావించేవారు. కానీ ఇప్పుడు అది చాలా నార్మల్ విషయం అయింది. ఎందుకంటే నాగార్జున చిరంజీవి సీనియర్ హీరోలతో నటించిన హీరోయిన్స్ వారి కొడుకులతో లేదా వారికి సంబంధించిన వారితో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నివేత పేతురాజ్ ఏ పాత్రలో నటించబోతుంది.. ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.