సాగర్ లో బీజేపీకి ఝలక్..! టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంజయ్యకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేసీఆర్.

అంజయ్యతో చర్చలు జరిపి పార్టీలో చేరేలా చొరవ చూపిన ఎమ్మెల్యేలు పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి.. ఆయన్ను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ తెలిపారు. సాగర్ లో బీజేపీ అభ్యర్ధిగా రవి నాయక్ కు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.