దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులు అయిన దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం దళిత బంధు. ఈ పథకంను పైలెట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించాడు. ఈ పథకం కోసం భారీ ఎత్తున నిధులు అవసరం అవుతాయి. పదుల సంవత్సరాలు గడిచినా కూడా అందరు దళితులకు దళిత బంధును అమలు చేయడం సాధ్యం అయ్యే పని కాదు అంటూ కొందరు విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పై ఉన్న అనుమానాలపై కేసీఆర్ స్పందించాడు.
కేసీర్ మాట్లాడుతూ.. దళిత బంధును దశల వారిగా అమలు చేస్తామని ప్రకటించాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేసేందుకు గాను 80 వేల కోట్ల నుండి రూ.1 లక్ష కోట్ల వరకు అవసరం అవుతాయని.. హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభం కాబోతున్న దళిత బంధు పథకంను రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే విస్తరిస్తామంటూ ప్రకటించాడు. ఈ పథకం ప్రతి ఒక్క అర్హులకు అందే విధంగా సహాయ సహకారం అందించాలని దళిత సంఘాలకు మరియు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాడు. దళిత బంధు పథకం గురించి హుజూరాబాద్ దళిత సంఘాల నాయకులతో మాట్లాడటం జరిగింది.