రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదని.. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే ఎంతటివారిపై అయినా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
నార్కోటిక్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్, వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం స్టేట్ పోలిస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు డ్రగ్స్ వ్యవహారంపై, నియంత్రణా చర్యలపై హోంమంత్రి, ఎక్సైజ్ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ, ఎస్పీలు, సీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
ఈ సమీక్షకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.