కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 నుంచి మే 4 వారకూ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ నిబంధనలు ఏప్రిల్ 30 (శుక్రవారం) సాయంత్రం నుంచి మే 4వ తేదీ (మంగళవారం) ఉదయం 7గంటలవ వరకూ అమలులో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉండగా.. వీకెండ్ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.
అయితే.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం వరకూ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా 29,824 కేసులు నమోదయ్యాయి. 266 మంది మృతి చెందారు. అలహాబాద్, లక్నో, వారణాసి, కాన్పూర్, నాగ్ పూర్, గోరఖ్ పూర్ నగరాల్లో ఏప్రిల్ 26 వరకూ లాక్ డౌన్ విధించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కోవిడ్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.