సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వారం రోజుల పరిధిలోనే సినీ పరిశ్రమకు చెందిన ఐదుగురు కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ వారంలోనే టాలీవుడ్ కు చెందిన దర్శకుడు సాయి బాలాజీ వరప్రసాద్ శ్రీ విష్ణుతో మా అబ్బాయి అనే సినిమాను తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో కన్నుమూశారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు కరోనా సోకడంతోనే గుండెపోటు వచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు కూడా ఇదే వారంలో కరోనాతో కన్నుమూశాడు. ప్రభాస్ తో సాహో రామ్ చరణ్ తో జంజీర్ రానాతో ఘాజీ వంటి సినిమాల్లో నటించిన బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ మహమ్మారి బారిన పడి మరణించాడు. కరోనా మహమ్మారి ధాటికి కన్నడ సినీ రంగం కూడా వణికిపోతోంది. ఇటీవల కరోనా సోకి నిర్మాత రాము మృతిచెందగా తాజాగా శుక్రవారం మరో నిర్మాత రాజశేఖర్ వైరస్ బారినపడి కన్నుమూశారు.
నీనాస్ సతీష్ నటిస్తున్న పెట్రో మ్యాక్స్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈయన ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే మహమ్మారికి బలయ్యారు. కన్నడ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు వరుసగా కరోనా బారినపడి మృతి చెందుతుండడంతో పలువురు నటులు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో రోజువారీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తర ప్రదేశ్ గుజరాత్ తర్వాత కర్ణాటక లోని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో కన్నడ సినీ రంగానికి కూడా ఈ ఎఫెక్ట్ పడుతోంది.