వినయ విధేయ రామగా మారిన డేవిడ్ వార్నర్‌

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ఆటగాడు.. ఐపీఎల్‌ ఆటగాడు అయిన డేవిడ్ వార్నర్‌ గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో తెలుగు సినిమాలకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలను తెగ షేర్‌ చేస్తున్నాడు. ఆ మద్య టిక్ టాక్ లో ఎన్నో తెలుగు సినిమాల పాటలను మరియు డైలాగ్ లను చెసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక తాజాగా ఆయన వినయ విధేయ రామ సినిమా లోని ఒక ఫైట్ సీన్‌ ను అనుసరించాడు. ఈయన హీరో ఫేస్ తో తన ఫేస్‌ ను మార్ఫింగ్ చేసి ఏదో ఫైట్‌ చేస్తున్నట్లుగా సరదా పడుతూ ఉంటాడు.

ఇప్పటి వరకు డాన్స్ ల కోసం తన ఫేస్ ను మార్ఫింగ్‌ చేసిన వార్నర్‌ ఈ సారి యాక్షన్‌ సన్నివేశం కోసం ఫేస్ మార్ఫింగ్ చేయడం జరిగింది. యాక్షన్‌ సన్నివేశంలో వార్నర్‌ ప్రతాపం చూపించాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో కరోనా కారణంగా మ్యాచ్ లు ఎక్కువగా ఉండటం లేదు. దాంతో ఆయనకు సమయం ఎక్కువగా లభిస్తుంది. తద్వార ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడేమో అంటూ కొందరు అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.