కూతురు వయసున్న అమ్మాయిలతో స్టార్ హీరోల రొమాన్సా..? హీరోయిన్‌ ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి దియా మీర్జా సీనియర్‌ స్టార్‌ హీరోలందరిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 50 ఏళ్లు దాటిన హీరోలు అందరు కూడా ఇంకా 20 ఏళ్ల లోపు హీరోయిన్స్‌ తో రొమాన్స్ చేస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్‌ చేయడం ఏంటో అంటూ ఎద్దేవ చేశారు. సీనియర్‌ హీరోలు 30,40 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్స్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. వారికి టీనేజ్‌ హీరోయిన్స్‌ మాత్రమే కావాలా అంటూ ప్రశ్నించింది.

బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా సీనియర్ హీరోలదే ప్రస్తుతం రాజ్యం నడుస్తోంది. వారు ఎక్కువ శాతం టీనేజ్‌ అమ్మాయిలతో మాత్రమే రొమాన్స్ కు సిద్దం అవుతున్నారు. టీనేజ్ అమ్మాయిలతో రొమాన్స్ చేయడం వల్ల వారికి వారు తమ వయసు తగ్గిపోయినట్లుగా అనుకుంటున్నారా అంటూ దియా ప్రశ్నించింది. సీనియర్‌ హీరోయిన్స్‌ కు మీరు ఎందుకు పాత్రలు ఇవ్వడం లేదు అంటూ ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించింది. అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా సీనియర్‌ హీరోలతో టీనేజ్‌ అమ్మాయిలు నటిస్తేనే చూడటం విడ్డూరంగా ఉందని దియా అసహనం వ్యక్తం చేశారు