ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ఉంటే పరిపూర్ణం అయ్యేది

నాని హీరోగా శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్‌ గా నటించిన జెర్సీ సినిమా కు జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్‌ ఎడిటింగ్ విభాగంకు గాను నవీన్ నూలికి ఈ అవార్డు రావడం పట్ల దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి స్పందించాడు. ఈ సినిమా కథ తయారు చేసుకుంటున్న సమయంలో మంచి నటీనటులు లభించాలని కోరుకున్నాను. నాని మరియు శ్రద్దా శ్రీనాధ్‌ లు సినిమాను చేసేందుకు ముందుకు వచ్చిన సమయంలో నేను బాగా సినిమా తీయాలని ఆశ పడ్డాను కాని అవార్డుల విషయం ఆలోచించలేదు.

హిందీ జెర్సీ ఎడిటింగ్ పనుల్లో ఉన్న సమయంలో నాకు ఫోన్‌ వచ్చింది. మొదట నమ్మాలనిపించలేదు. చాలా సంతోషం వేసింది. మా సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషం. ఉత్తమ సినిమాగా అవార్డు రానందుకు నిరుత్సాహం లేదు. కాని ఈ సినిమాలో నాని మంచి నటన కనబర్చారు. ఆయకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చి ఉంటే మా జెర్సీ పరిపూర్ణమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లు అయ్యేదని అన్నారు. నాని జాతీయ అవార్డు కు పూర్తి అర్హుడు అంటూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అభిప్రాయం వ్యక్తం చేశారు.