శంకర్ పై లీగల్ పోరాటానికి సిద్దమైన అన్నియన్ నిర్మాత

అగ్ర దర్శకుడు శంకర్ వరసగా ఇబ్బందుల్లో పడుతున్నాడు. ఇండియన్ 2 సినిమా విషయంలో ఇప్పటికే సన్ పిక్చర్స్ వారితో లీగల్ పోరాటం కొనసాగుతోంది. తమ సినిమాను పూర్తి చేయకుండానే మరో సినిమా చేస్తున్నాడని శంకర్ పై కేసు వేశారు.

ఇదిలా ఉంటే మరోసారి చిక్కుల్లో పడ్డాడు శంకర్. నిన్ననే తమిళంలో సూపర్ హిట్ అయిన అన్నియన్ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా తెలియజేసిన సంగతి తెల్సిందే. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమా పట్టాలెక్కుతోందని కూడా తెలియజేసారు.

కట్ చేస్తే ఇప్పుడు అన్నియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ కు నోటీసులు జారీ చేసారు. “అన్నియన్ కథ రచయిత సుజాత వద్ద నుండి కథ హక్కులు నేను సొంతం చేసుకున్నాను. దానికి తగిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. అయితే నన్ను సంప్రదించకుండా శంకర్ ఇలా హిందీలో అన్నియన్ చిత్రాన్ని తీస్తున్నారని తెలిసి షాక్ తిన్నాను. దీనిపై లీగల్ గా పోరాడతాను” అని రవిచంద్రన్ ప్రెస్ నోట్ విడుదల చేసాడు.