ఇటివల తెలుగులో బిగ్ బాస్4 సీజన్ లో సందడి చేసిన కంటెస్టెంట్ సూర్య కిరణ్. వృత్తిరీత్యా సినీ దర్శకుడు. సుమంత్ తో సత్యం వంటి హిట్ సినిమా తీశాడు. మళ్లీ సుమంత్ తోనే ‘ధన’ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటినుంచీ కాస్త సైలెంట్ అయ్యాడు. సూర్య కిరణ్. అయితే.. ఇటివల బిగ్ బాస్ షోతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే.. మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు గురై హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.
ఈనేపథ్యంలో సూర్యకిరణ్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. వీటిలో వృత్తి, బిగ్ బాస్ తోపాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సూర్య కిరణ్ 2010లో హీరోయిన్ కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. కొన్నేళ్ల నుంచీ వీరిద్దరి దాంపత్య జీవితంపై అనేక వార్తలు రౌండ్ అయ్యాయి. వీరిద్దరూ విడిపోయారంటూ రకరకాల కథనాలు వచ్చాయి కానీ.. వీరిద్దరిలో ఎవరూ దీనిపై స్పందించింది లేదు. ఇప్పుడు సూర్య కిరణ్ దీనిపై స్పందించాడు.
తాను, కల్యాణి విడిపోయామని చెప్పుకొచ్చాడు. కల్యాణి అంటే తనకు ఇప్పటికీ ఇష్టమే అంటున్నాడు. కొన్ని కారణాల వల్ల తాను నా నుంచి విడిపోయింది. ఆమె మళ్లీ నా జీవితంలోకి వస్తానంటే సంతోషంగా ఆహ్వానిస్తా అంటున్నాడు. కల్యాణి ‘శేషు’ సినిమాతో పరిచయం అయింది. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ.. కబడ్డీ, శివరామరాజు.. వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది వచ్చిన ‘యాత్ర’ సినిమాలో కల్యాణి నటించారు.