మాల్దీవుల్లో సీక్రెట్ గా లవ్‌ కపుల్‌ ఎంజాయ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ మరియు దిశా పటానీలు ప్రేమలో ఉన్న విషయం బాలీవుడ్‌ లో ప్రతి ఒక్కరికి తెలుసు. వీరిద్దరు కలిసి పలు సందర్బాల్లో బయట కనిపించారు. అయితే మొదటి సారి వీరిద్దరు సీక్రెట్‌ గా మాల్దీవులకు వెళ్లారు. సహజంగా అయితే మాల్దీవులకు హనీమూన్‌ కు పెళ్లి అయిన వారు వెళ్తారు. కాని పెళ్లి కాకుండానే ఈ జంట సీక్రెట్‌ గా ఎంజాయ్ చేసేందుకు అక్కడకు వెళ్లి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచారు.

ఇటీవలే దిశా పటానీ మాల్దీవుల్లో ఉన్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. దానికి తోడు టైగర్ కూడా మాల్దీవులకు వెళ్లినట్లుగా క్లారిటీ వచ్చింది. దాంతో ఇద్దరు కూడా ఒకే చోట ఎంజాయ్‌ చేస్తున్నారని అంతా బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం వీరిద్దరు మాల్దీవుల్లో అందమైన సముద్రపు అందాలను ఆస్వాదించే పనిలో ఉన్నారు. ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తన్న నేపథ్యంలో మాల్దీవులకు వీరిద్దరు రిలాక్స్ కోసం వెళ్లారు. షూటింగ్‌ లకు బ్రేక్ ఇచ్చి అందాలను ఆస్వాదిస్తున్న ఈ సీక్రెట్ జంట వారం రోజుల తర్వాత ముంబయికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.