పైలెట్‌ అవ్వాలనుకుని హీరోయిన్‌ అయ్యిందట

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దిశా పటానీ ఇటీవల ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆమె అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. హీరోయిన్ గా అవకాశం రాకుండా ఉంటే విమానం తోలుకుంటూ ఉండేదాన్ని అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. పైలెట్ కావాలనేది తన కోరిక. కాని హీరోయిన్ గా ఆఫర్లు రావడంతో నా కలను పక్కకు పెట్టేశాను అంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వారు కూడా ఇంకా సరైన ఆఫర్లు రాకుండా లేకుండా ఉన్నారు. అలాంటిది తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి స్టార్‌ డం దక్కింది.

తనకు దక్కిన స్టార్‌ డమ్‌ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా దిశా పటానీ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడి ప్రేమ విషయమై మాత్రం స్పందించేందుకు నో చెప్పింది. ఎప్పటి వరకు ఈ విషయాన్ని మౌనంగా ఉంచాలనుకుంటున్నారు అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆమె మౌనమే సమాధానం అన్నట్లుగా ఆ ప్రశ్నలు వదిలేసింది. మొత్తానికి ముద్దుగుమ్మ దిశా పటాని సోషల్‌ మీడియాలో తన కల గురించి ప్రియుడి గురించి స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది.