ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా వరుసగా హిట్ సినిమాలకు ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. అలా దేవీశ్రీ మ్యూజిక్ అందించి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా ‘ఉప్పెన’. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.
ముఖ్యంగా ఉప్పెనలో ‘నీకన్ను నీలి సముద్రం’ పాట 8 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసింది. పాటల విషయంలో టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే ఇంత సూపర్ హిట్ ఆల్బమ్ కి దేవీశ్రీకి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. స్వతహాగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే రెమ్యునరేషన్ అండ్ ఖర్చులతో కలిపి 2 – 3 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుంది. కానీ సుకుమార్ తో ఉన్న సాన్నిహిత్యం వలన సుకుమార్ రైటింగ్స్ కింద చేసే సినిమాలకు మాత్రం రెమ్యునరేష్ లేకుండా మ్యూజిక్ చేసి వచ్చే ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాడు.
గతంలో వచ్చిన కుమారి 21F సినిమా నుంచి ఇదే తంతు నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ‘ఉప్పెన’ విషయంలోనూ అదే డీల్ ని ఫాలో అవుతున్నారు దేవీశ్రీ. సుమారు 24 కోట్లతో రూపొందిన ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ అటాక్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ సెట్ అయ్యాక రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.