‘ఆ ముగ్గురి టైమ్ నడుస్తోంది’ జాతిరత్నాలు ఫంక్షన్ లో మంత్రి ఎర్రబెల్లి

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జాతిరత్నాలు‘ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. చిత్ర విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘జాతి రత్నాలు సినిమా గురించి గొప్పగా వింటున్నాను. చాలా మంది స్నేహితులు ఫోన్ చేసి సినిమా చూడమంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉండటం వల్ల చూడటం కుదరలేదు’.

‘వీలు చూసుకుని సినిమా ఖచ్చితంగా చూస్తాను. వరంగల్‌లో కూడా ప్రోగ్రాం పెట్టిస్తాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది. ప్రస్తుతం వారి టైమ్ నడుస్తోంది. చాలా సినిమాల్లో అద్భుతంగా నటిస్తుంటారు. ఇప్పుడీ సినిమాకు అందరూ కలిసి పని చేశారు. అద్భుతమైన కామెడీతో ఉన్న సినిమాను ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్స” అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్, హీరోయిన్ ఫరియా, సీనియర్ హీరో నరేశ్.. చిత్ర యూనిట్ పాల్గొన్నారు.