మరో ఇంట్రెస్టింగ్ ఆఫర్ ను పట్టేసిన ఈషా రెబ్బా

తెలుగు భామ ఈషా రెబ్బా అడపాదడపా అవకాశాలను సంపాదించుకుంటూ ముందుకెళుతోంది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను సంపాదించుకుంటోంది ఈ భామ.

లేటెస్ట్ గా పిట్ట కథలు అనే ఆంథోలోజి మూవీలో కీలక పాత్రలో నటించింది ఈషా. అలాగే పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈషా ఒక ఆసక్తికర ఆఫర్ ను సంపాదించుకుంది.

గోపీచంద్, మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మార్చ్ 5 నుండి మొదలవుతుంది. రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ రోల్ లో ఈషా రెబ్బాను తీసుకున్నారు. ఈ చిత్రం ఈషాకు ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తోంది.