ఎక్స్ క్లూజివ్: త్రివిక్రమ్‌తో కంటే ముందు రావిపూడితో రామ్‌


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రామ్‌ సినిమా చేయబోతున్నాడు అంటూ ఇటీవల మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందని భావించారు. కాని మొదట ఎన్టీఆర్ 30 మూవీనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌ సినిమా అయితే ఉంటుంది కాని అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేను అంటూ రామ్‌ అన్నాడు. తాజాగా రామ్‌ తదుపరి సినిమా పై క్లారిటీ వచ్చేసింది. వచ్చే సమ్మర్‌ లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో రామ్‌ సినిమా మొదలు పెట్టబోతున్నాడు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా రూపొందుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మరో మూడు నెలల్లోనే అనీల్ రావిపూడి సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంది. వచ్చే దసరాకు లేదా అంతకు ముందే సినిమాను విడుదల చేయాలని అనీల్ రావిపూడి ప్లానింగ్ లో ఉన్నాడట. మరో వైపు రామ్ కోసం కూడా కథను సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే రామ్‌ మరియు అనీల్ రావిపూడిల కాంబో మూవీ ఓకే అయ్యింది. ఇద్దరు కూడా అన్ని విషయాల గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రారంభించి వీలు ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనీల్ రావిపూడి ఆశ పడుతున్నాడు.