పాన్ ఇండియా` అన్న ఐడియాలజీ సరిహద్దులను చెరిపేసి బంధాలను కలుపుతోంది. ఇరుగు పొరుగు హీరోల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతోంది. భాష ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందే సినిమాల రూపకల్పనకు ఆస్కారం కలుగుతోంది. ఇక ప్రజల సినిమా వీక్షణ విధానాన్ని ఇది అమాంతం మార్చేస్తోంది. ఒకప్పటి ఆడియెన్ తో పోలిస్తే ఇప్పుడు అంతా జనరలైజ్డ్ ఆడియెన్ గా మారడం సరికొత్త పరిణామం. ఇప్పుడున్న ఆడియెన్ ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ని ఆదరించినంత ఈజీగా పొరుగు భాషల స్టార్లు నటించే సినిమాల్ని ఆదరిస్తున్నారు. ఇది ఊహించని పరిణామం అని చెప్పాలి.
ఇటీవలి కాలంలో ఇరుగు పొరుగు స్టార్లను కలుపుకుని తెలుగులో సినిమాలను రూపొందిస్తుండడంతో ఇతర భాషల్లోనూ టాలీవుడ్ కి మైలేజ్ పెరుగుతోంది. ఆ కోవలోనే సుకుమార్ ప్రస్తుతం పుష్ప చిత్రానికి పొరుగు గ్లామర్ ని యాడ్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. ఇప్పుడు పుష్ప చిత్రానికి అక్కడ పాపులర్ స్టార్ ఫహద్ ఫాజిల్ ని యాడప్ చేశారు. అతడు ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు-మలయాళంలో ఈ సినిమా మార్కెట్ రేంజ్ ను అమాంతం పెంచే ఎత్తుగడ ఇదని చెప్పొచ్చు.
తాజా ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ ఓ రహస్యాన్ని ఓపెన్ చేశారు. నిజానికి పుష్ప సినిమా కంటే ముందే సుకుమార్ తో ఓ సినిమా చేయాలని ఫహద్ చాలాకాలంగా ప్లాన్ లో ఉన్నాడట. అతడు సుకుమార్
సినిమాలన్నీ చూశారు.. తనకు బాగా నచ్చుతాయట. సుక్కూ కూడా అతడిని అభిమానిస్తాడు. ఆ ఇద్దరూ చాలాకాలంగా టచ్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడిలా పుష్పలో విలన్ పాత్రలో నటించే అవకాశం అనుకోకుండానే ఫహద్ ని వరించింది. ఈ అవకాశం లక్కీ అని అతడు తెలిపాడు. సెకండ్ వేవ్ రాకతో అప్పట్లో షెడ్యూల్ ని బ్రేక్ చేసిన ఫహద్ కేరళకు వెళ్లిపోయారు. ఇప్పుడు కరోనా ఉధృతి తగ్గాక పుష్ప షెడ్యూల్ మొదలైంది. తిరిగి అతడు సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇక ఫహద్ తెలుగులో ఓ సినిమా చేస్తుండగానే అతడి భార్యామణి మేటి నాయిక నజ్రియా నజీమ్ కూడా తెలుగు-తమిళంలో పలు చిత్రాలలో నటిస్తున్నారు.
ఫహద్ ఫాసిల్ మలయాళంలో పెద్ద స్టార్. అతడు ఇంతకు ముందు తమిళంలో నటించారు కానీ తెలుగులో నటించలేదు. పుష్ప తెలుగులో అతని మొదటి చిత్రం. ఇక తెలుగు ఆడియెన్ కి అతడు బెంగళూరు డేస్ చిత్రంతో కొంతవరకూ సుపరిచితం. అప్పట్లో బెంగళూరు డేస్ సినిమా మల్టీప్లెక్సుల్లో తెలుగు ఆడియెన్ నుంచి యువతరం నుంచి ఆదరణ పొందింది. అలా అతడు ఇక్కడ మెట్రోలకు సుపరిచితం. ఇక ఎంచుకునే పాత్ర విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉండే ఫహద్ అనూహ్యంగా పుష్ప చిత్రానికి సంతకం చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ట్రాన్స్ లాంటి చిత్రంతో ఫహద్ జాతీయ ఉత్తమ నటుడిగా ఖ్యాతి ఘడించారు. అలాంటి పెర్ఫామర్ తెలుగు ఆడియెన్ కి పరిచయం కావడం ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కలిగించే భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పుష్ప. ఈ చిత్రంలో పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో బన్ని నటిస్తున్నారు. స్మగ్లర్లకు పోలీసులకు మధ్య వార్ నేపథ్యం అడవి బ్యాక్ గ్రౌండ్ ప్రతిదీ ఎగ్జయిట్ మెంట్ పెంచేవే. ఈ మూవీ మెజారిటీ షెడ్యూల్ ని మారేడుమిల్లి అడవుల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే.
ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. సునీల్- అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్ర సంగీతం అందిస్తున్నారు. దాదాపు 100కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.